FD Rates: 8 శాతం వడ్డీ ఇస్తున్న కార్పొరేట్‌ సంస్థలివే..

FD Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్న ప్రముఖ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సంస్థలపై ఓ లుక్కేయండి.

Published : 22 Oct 2023 11:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రెపోరేట్లు పెంచినప్పటి నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (FD) అందించే వడ్డీ రేట్లు బాగా పెరిగాయి. దీంతో బజాజ్‌ ఫైనాన్స్‌ , ముత్తూట్ క్యాపిటల్‌ సర్వీసెస్‌తో పాటూ మరో మూడు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు సైతం ఎఫ్‌డీ వడ్డీ రేట్లను ఆకర్షణీయంగా పెంచాయి. ఐదేళ్ల కాల వ్యవధితో అందించే ఎఫ్‌డీలకైతే ఏకంగా 8 శాతం కంటే ఎక్కువ వడ్డీలను అందిస్తున్నాయి.

ముత్తూట్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌: ఏడాది వ్యవధితో  అందించే ఎఫ్‌డీలకు 7.21 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక మూడేళ్ల పాటు ఎఫ్‌డీలపై 8.07 శాతం, ఐదేళ్ల పాటు అయితే 8.38 శాతం అత్యధిక వడ్డీని అందిస్తోంది.

శ్రీరామ్‌ ఫైనాన్స్‌: ఏడాది కాలవ్యవధితో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7.34 శాతం, మూడేళ్ల పాటూ అయితే 7.95 శాతం, ఐదేళ్ల పాటు అయితే ఏకంగా 8.18 శాతం వడ్డీని ఇస్తోంది.

బజాజ్‌ ఫైనాన్స్‌: ఆర్థిక సంస్థ బజాజ్‌ ఫైనాన్స్‌ కూడా ఎఫ్‌డీలపై అధిక వడ్డీని అందిస్తోంది. సంవత్సరం పాటూ చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7.40 శాతం, మూడేళ్ల పాటూ అయితే 8.05 శాతం, ఐదేళ్ల పాటు అయితే 8.05 శాతం వడ్డీని ఇస్తోంది.

మహీంద్రా ఫైనాన్స్‌: సంవత్సరం కాలంతో చేసే ఎఫ్‌డీలకు 7.60 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక మూడేళ్ల పాటు చేసే ఎఫ్‌డీలపై 8.05 శాతం, ఐదేళ్ల పాటు అయితే 8.05 శాతం వడ్డీని అందిస్తోంది.

సుందరం హోమ్‌ ఫైనాన్స్‌: సంవత్సరం పాటూ చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై 7.45 శాతం, మూడేళ్ల పాటూ అయితే 7.75 శాతం, ఐదేళ్ల పాటు కాల వ్యవధితో అయితే 7.90 శాతం అత్యధిక వడ్డీని ఇస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని