Fixed deposits: ఈ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై 9% పైగా వడ్డీ.. వీరికి మాత్రమే!

Fixed deposits: వివిధ బ్యాంకులు సీనియర్‌ సిటిజన్లు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై అత్యధిక వడ్డీని అందిస్తున్నాయి. ఆ బ్యాంకులపై ఓ లుక్కేయండి.

Published : 26 Feb 2024 02:16 IST

Fixed deposits | ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణ డిపాజిట్లతో పోలిస్తే, సీనియర్‌ సిటిజన్లు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (Fixed deposits)పై అన్ని బ్యాంకులు అధిక వడ్డీ అందిస్తున్నాయి. ప్రస్తుతం చాలా బ్యాంకుల్లో సీనియర్‌ సిటిజన్ల ఎఫ్‌డీలపై 9శాతానికి పైగా వడ్డీ లభిస్తోంది. వివిధ కాలావధి పరిమితులతో తీసుకొచ్చిన ఎఫ్‌డీలపై బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను ఓ సారి చూసేద్దాం..

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 7 రోజుల నుంచి 10ఏళ్ల మధ్య మెచ్యూర్‌ అయ్యే డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లకు 4.50శాతం నుంచి 9.5 శాతం వరకు వడ్డీని బ్యాంక్‌ అందిస్తోంది. 1001 రోజులతో మెచ్యూర్‌ అయ్యే ఎఫ్‌డీలపై అత్యధికంగా 9శాతం వడ్డీ పొందొచ్చు. 2024 ఫిబ్రవరి 2 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 7 రోజుల నుంచి 10ఏళ్ల కాల వ్యవధితో చేసే ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లకు 4శాతం నుంచి 9శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 444 రోజుల డిపాజిట్‌పై అత్యధికంగా 9శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్‌ సిటిజన్లు చేసే ఎఫ్‌డీలపై 0.50శాతం అధిక వడ్డీ లభిస్తోంది. ఈ కొత్త వడ్డీ రేట్లు 2023 ఆగస్టు 21 నుంచి అమల్లోకి వచ్చాయి.

జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్‌ అయ్యే డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 9 శాతం వడ్డీని అందిస్తోంది. 365 రోజుల డిపాజిట్‌పై అత్యధికంగా 9శాతం వడ్డీ ఇస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు 2024 జనవరి 2 నుంచి అమల్లోకి వచ్చాయి.

గ్రామీణ కుటుంబాల నెలవారీ తలసరి వ్యయం రూ.3,773

సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: సీనియర్‌ సిటిజన్లకు 7 రోజుల నుంచి 10ఏళ్ల కాల వ్యవధితో చేసే ఎఫ్‌డీలపై 4.50 శాతం నుంచి 9.10 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. 2 సంవత్సరాల 2 రోజులతో మెచ్యూర్‌ అయ్యే ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.10శాతం వడ్డీ పొందొచ్చు. కొత్త వడ్డీ రేట్లు 2023 డిసెంబరు 22 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: సీనియర్‌ సిటిజన్లు 7రోజుల నుంచి 10ఏళ్ల మధ్య మెచ్యూర్‌ అయ్యే ఎఫ్‌డీలపై 3.06శాతం నుంచి 9.21శాతం వరకు వడ్డీ అందిస్తోంది. 750 రోజులు చేసే డిపాజిట్‌పై అత్యధికంగా 9.21శాతం వడ్డీ లభిస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు 2023 అక్టోబర్‌ 28 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: సీనియర్‌ సిటిజన్లు 7 రోజుల నుంచి 10ఏళ్ల కాల వ్యవధితో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 4.60 శాతం నుంచి 9.10 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. రెండేళ్లు, మూడేళ్లతో మెచ్యూర్‌ అయ్యే ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.10శాతం వడ్డీ పొందొచ్చు. 2023 ఆగస్టు 21 నుంచి అమల్లోకి వచ్చాయి.

గమనిక: వడ్డీ రేట్లపై అవగాహన కోసమే ఈ సమాచారం. పూర్తి వివరాలు దగ్గర్లోని బ్యాంకు శాఖను సంప్రదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు