ITR: ఈ-వెరిఫికేష‌న్ గ‌డువు త‌గ్గించిన‌ CBDT

గ‌డువు లోప‌ల ఐటీఆర్ దాఖ‌లు చేసిన‌ప్ప‌టి, అనుమితించిన గ‌డువులోపు ఈ - వెరిఫికేష‌న్ పూర్తిచేయ‌డంలో విఫ‌లం అయితే అటువంటి రిట‌ర్నుల‌ను ఆల‌స్య‌పు రిటర్నుల కింద ప‌రిగ‌ణిస్తారు

Updated : 01 Aug 2022 14:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల ధ్రువీక‌ర‌ణ కాల ప‌రిమితిని 30 రోజుల‌కు త‌గ్గించిన‌ట్లు కేంద్ర ప్ర‌త్యక్ష ప‌న్ను విభాగం (CBDT) ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఒక నోటిఫికేష‌న్‌లో తెలిపింది. ఇది నేటి (ఆగ‌ష్టు 1) నుంచి అమ‌ల్లోకి వచ్చింది. ఇంత‌కు ముందు ఈ-వెరిఫికేష‌న్ కోసం 120 రోజుల స‌మ‌యం ఉండేది. 

ఐటీఆర్ - V ఫారం ద్వారా ఈ-వెరిఫికేష‌న్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ అనుమితించిన 30 రోజుల గ‌డువులోపు ఈ-వెరిఫికేష‌న్ పూర్తిచేయ‌ని పక్షంలో ఐటీఆర్ దాఖ‌లు చేయ‌న‌ట్లుగా ప‌రిగ‌ణిస్తారు. అటువంటి వారు తిరిగి ఐటీఆర్ ఫైల్ చేయాల్సి రావ‌చ్చు. అంతేకాకుండా ఆల‌స్య‌పు రిట‌ర్నులు ఫైల్ చేసిన వారు ఎదుర్కొనే అన్ని ప‌రిణామాలనూ ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది. అందువ‌ల్ల ఐటీఆర్ దాఖ‌లు చేసిన వారు వీలైనంత త‌ర్వ‌గా ఈ-వెరిఫికేష‌న్ పూర్తి చేయ‌డం మంచిది.

నోటిఫికేష‌న్ ప్ర‌కారం.. 

  • ఎల‌క్ట్రానిక్ మాధ్య‌మం ద్వారా ఐటీఆర్ దాఖ‌లు చేసిన వారు 30 రోజుల్లోపు ఇ-వెరిఫై/ఐటీఆర్-Vని స‌మ‌ర్పించాలి. ఈ విధంగా చేసిన‌ప్పుడు మాత్ర‌మే ఎల‌క్ట్రానిక్‌గా డేటాను బ‌దిలీ చేసిన తేదీని ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసిన‌ తేదీగా ప‌రిగ‌ణిస్తారు.
  • ఈ-వెరిఫికేష‌న్‌కు సంబంధించి ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు ముందే ఎల‌క్ట్రానిక్ మాధ్య‌మం ద్వారా రిట‌ర్నులు దాఖ‌లు చేసిన వారికి ఇంత‌కు ముందున్న 120 రోజుల గ‌డువే వ‌ర్తిస్తుంది.
  • గ‌డువు లోప‌ల ఐటీఆర్ దాఖ‌లు చేసిన‌ప్ప‌టికీ, అనుమితించిన గ‌డువులోపు ఈ-వెరిఫికేష‌న్ పూర్తిచేయ‌డంలో విఫ‌లం అయితే అటువంటి రిట‌ర్నుల‌ను ఆల‌స్య‌పు రిటర్నుల కింద ప‌రిగ‌ణిస్తారు. చ‌ట్ట ప్ర‌కారం ఆల‌స్య‌పు రిట‌ర్నులు దాఖ‌లు చేసిన వారు ఎదుర్కొనే అన్ని ప‌రిణామాలూ వీరికి వ‌ర్తిస్తాయి. 
  • ధ్రువీక‌రించిన ఐటీఆర్-V, నిర్ణీత‌ ఫార్మాట్‌లో నిర్ణీత‌ ప‌ద్ధ‌తిలో మాత్రమే స్పీడ్ పోస్ట్ ద్వారా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్, ఆదాయపు పన్ను శాఖ, బెంగళూరు - 560 500, కర్ణాటక వారికి పంప‌వ‌చ్చు. స్పీడ్ పోస్ట్ పంపిన తేదీని ఐటీఆర్-V పంపిన తేదీగా పరిగ‌ణిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని