Credit Card: క్రెడిట్‌ కార్డు అధికంగా వాడుతుంటే..

కొత్తగా రుణం తీసుకోవాలి అని బ్యాంకులకు దరఖాస్తు చేయగానే ముందుగా క్రెడిట్‌ స్కోరునే చూస్తాయి. మీకు అప్పు చేయడానికి అర్హత ఉందా? లేదా? అని పరిశీలిస్తాయి.

Published : 02 Jun 2023 00:05 IST

కొత్తగా రుణం తీసుకోవాలి అని బ్యాంకులకు దరఖాస్తు చేయగానే ముందుగా క్రెడిట్‌ స్కోరునే చూస్తాయి. మీకు అప్పు చేయడానికి అర్హత ఉందా? లేదా? అని పరిశీలిస్తాయి. అంతేకాదు.. వడ్డీ రేట్లలో రాయితీలు పొందాలన్నా మంచి క్రెడిట్‌ స్కోరు అవసరమే. దీనిని నిర్ణయించడంలో మీ క్రెడిట్‌ కార్డుకు ఎంతో ప్రాధాన్యం ఉందని మీకు తెలుసా? అందుకే, ఈ కార్డు వినియోగంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి.

తీసుకున్న రుణాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులను ఎలా చెల్లిస్తున్నారన్నది క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేస్తుంది. బిల్లులను సకాలంలో చెల్లించినప్పుడు స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్క రోజు ఆలస్యం జరిగినా ఇది పడిపోతుంది.
చాలామంది తమ కార్డు పరిమితి మేరకు వాడేస్తుంటారు. నిజానికి ఇది సరికాదు. తరచూ ఇలా చేస్తున్నప్పుడు రుణదాతలు మీరు రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారనే అంచనాకు వస్తారు. దీంతో కొత్తగా అప్పు ఇవ్వడానికి కాస్త సందేహించవచ్చు.

ఏం చేయాలంటే..

క్రెడిట్‌ కార్డు పరిమితి ఎంతుందో చూసుకోండి. అందులో కనీసం 30-40 శాతానికి మించి వాడకుండా ఖర్చు చేయాలి. తక్కువ పరిమితితో ఉన్న కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు మీ దగ్గర రూ.20వేల పరిమితితో కార్డు ఉందనుకోండి.. అందులో రూ.10వేలు వాడితే.. 50 శాతం వాడినట్లే. అప్పుడు మీరు అధికంగా కార్డును వాడుతున్నట్లు లెక్కిస్తాయి క్రెడిట్‌ బ్యూరో సంస్థలు. కాబట్టి, ఇలాంటి చిన్న కార్డులను వీలైనంత వరకూ వాడకపోవడమే మేలు.
* రెండు లేదా మూడు కార్డులకు మించి తీసుకోకపోవడమే ఉత్తమం. అధికంగా కార్డులుంటే.. నిర్వహణ కష్టం. ఒక్క బిల్లు మర్చిపోయినా స్కోరు దెబ్బతింటుంది.
* మీ అవసరానికి మించి కార్డులతో కొనుగోళ్లు చేయొద్దు. కనీస మొత్తం చెల్లించే అవకాశం ఉంటుంది. దీన్ని కేవలం ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడుకోవాలి. ప్రతిసారీ కనీస మొత్తమే చెల్లిస్తే.. వడ్డీ భారం పడుతుంది. రుణ చరిత్రా దెబ్బతింటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని