Scooters: భారత్‌లో వేగంగా అమ్ముడయ్యే టాప్ 5 స్కూటర్లివే
భారత్‌లోని విక్రయిస్తున్న టాప్ 5, 110సీసీ స్కూటర్‌ల గురించి ఇక్కడ ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో వేగంగా విక్రయం జరుగుతున్న స్కూటర్లలో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, హీరో జూమ్, హీరో ప్లెజర్ ప్లస్, హోండా డియో ఉన్నాయి. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ భారత్‌లోని అత్యధికంగా అమ్ముడైన 110సీసీ స్కూటర్లగా బాగా ప్రాచుర్యం పొందాయి. గేర్‌లెస్ స్కూటర్ల విభాగంలో 110సీసీ మోడల్స్ 60 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. గేర్‌లెస్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో అతిపెద్ద వాటా ఈ స్కూటర్లదే. ట్రాఫిక్‌లో కూడా అన్ని వయసుల స్త్రీ, పురుష వాహన చోదకులు సులభంగా నడపడానికి వీలుండడం వీటి ప్రత్యేకత. 110 సీసీ వాహనాలు అధిక మైలేజీని ఇవ్వడం వల్ల కూడా ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. భారత్‌లో ఎక్కువగా అమ్ముడయ్యే టాప్ 5 స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హోండా యాక్టివా
ఇది భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్, భారీ ఫాలోయింగ్ కలిగి ఉంది. యాక్టివా 6జీ 109.51సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.75,347 నుంచి రూ.81,378గా ఉంది.
హీరో ప్లెజర్ ప్లస్
ఈ స్కూటర్ తేలికపాటి డిజైన్‌తో రూపొందింది. దీంతో మహిళా రైడర్‌లు మెచ్చే విధంగా ప్రసిద్ధి చెందింది. ప్లెజర్ ప్లస్ 109.90సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.69,638 నుంచి రూ.78,538గా ఉంది.
టీవీఎస్ జూపిటర్
కుటుంబ స్కూటర్‌గా ప్రసిద్ధి చెందింది. అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఇదీ ఒకటి. ఇది 109.70సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ప్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో వస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.72,190 నుంచి రూ.88,498గా ఉంది.
హీరో జూమ్
Hero Xoom.. 110 సీసీ స్కూటర్ సెగ్మెంట్‌లో సరికొత్తగా ప్రవేశించింది. ఇందులో 110.90సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ప్యూయల్ ఇంజెక్ట్ ఇంజిన్ ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.69,099 నుంచి రూ.77,199గా ఉంది.
హోండా డియో
‘డియో’ లుక్ పరంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. హోండా డియో 109.51 సీసీ సింగిల్ సిలిండర్, ఎయర్ కూల్డ్ ఇంజిన్‌తో తయారయింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.68,625 నుంచి రూ.72,626గా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
TTD: సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు