WhatsApp: పేరు లేకుండానే గ్రూప్‌ క్రియేట్‌ చేసేలా.. వాట్సాప్‌ కొత్త ఫీచర్‌

WhatsApp: ఇకపై వాట్సాలో క్రియేట్‌ చేసే గ్రూపులకు పేరు కచ్చితంగా ఉండాల్సన అవసరం లేదు. ఈ మేరకు మార్పులు చేసినట్లు ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ తెలిపింది.

Updated : 24 Aug 2023 16:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మన ముందుకు వస్తూనే ఉంది. చాట్‌ ఎడిట్‌, చాట్ లాక్, వీడియో కాల్‌ సమయంలో స్క్రీన్‌ షేరింగ్‌, హెచ్‌డీ ఫొటో షేరింగ్‌ వంటి ఎన్నో సరికొత్త ఫీచర్లను ఇప్పటికే యూజర్లకు అందించింది. తాజాగా గ్రూప్‌ క్రియేట్‌ చేయటంలో వాట్సాప్‌ కొత్త మార్పును తీసుకొచ్చింది. 

సాధారణంగా వాట్సాప్‌లో గ్రూప్‌ క్రియేట్‌ చేయాలంటే ముందుగా కాంటాక్ట్స్‌లోని వారిని సెలెక్ట్ చేసుకొని దానికో పేరు పెట్టాలి. అప్పుడే గ్రూప్ క్రియేట్ అవుతుంది. అయితే, ఏదైనా హడావిడిలో పేరు ఎంపిక సాధ్యం కాకపోతే.. గ్రూప్‌ క్రియేట్‌ చేయడం కుదరదు. ఇకపై ఆ సమస్య ఉండబోదని వాట్సాప్ తెలిపింది. పేరుపెట్టాలనే నియమం లేకుండా వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ విషయాన్ని మెటా (Meta) సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) తన ఫేస్‌బుక్‌ (Facebook) ఖాతా ద్వారా వెల్లడించారు. అలాగే దానికి సంబంధించిన ఓ ఫోటోలను కూడా షేర్ చేశారు.

టీవీఎస్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 140 km

అత్యధికంగా ఆరుగురుతో క్రియేట్‌ చేసే వాట్సాప్ గ్రూప్‌లకు ఇకపై పేరు లేకపోయినా ఫర్వాలేదు. సభ్యుల పేర్ల ఆధారంగా గ్రూపు పేరు డైనమిక్‌గా మారుతుంటుంది. ప్రతి సభ్యుడికి వారి కాంటాక్టుల ఆధారంగా ఈ పేరు వేర్వేరుగా కనిపిస్తుంది. కావాలనుకుంటే తర్వాత గ్రూప్‌కి పేరు పెట్టొచ్చు. కేవలం అడ్మిన్‌ మాత్రమే కాకుండా గ్రూప్‌లోని సభ్యులు కూడా పేరును మార్చవచ్చు. అయితే, కాంటాక్ట్‌ని సేవ్‌ చేసుకోని వారికి మాత్రం ఫోన్‌ నంబర్ డిస్‌ప్లే అవుతుందని వాట్సాప్‌ వెల్లడించింది. రానున్న కొన్ని వారాల్లో ఈ సరికొత్త ఫీచర్ ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి రానుందని వాట్సాప్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని