WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. మీ చాట్‌కు ఇక లాక్‌ వేసేయొచ్చు..

WhatsApp: వ్యక్తిగత చాట్లను ఇతరులెవరూ చూడకుండా లాక్‌ చాట్‌ అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Published : 16 May 2023 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్ల ప్రైవసీని మరింత పెంచేలా ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘లాక్‌చాట్‌’ ఫీచర్‌పై కసరత్తు చేసి ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఆ సంస్థ సోమవారం రాత్రి వినియోగదారులకు పరిచయం చేసింది. ఈ విషయాన్ని మెటా సంస్థ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. WhatsAppలో మీ సంభాషణలు, చాట్‌లను మరింత గోప్యంగా ఉంచుకోవచ్చు.. పాస్‌వర్డ్‌ రక్షణతో ఫోల్డర్‌లో భద్రం చేసుకోవచ్చ అని ఆయన పేర్కొన్నారు. అలాగే, వాట్సాప్‌ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఈ ఫీచర్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫీచర్‌ ద్వారా ప్రైవేట్‌ చాట్‌లకు లాక్‌ విధించుకొనే ఆప్షన్‌తో పాటు వ్యక్తిగత చాట్‌పై యూజర్లకు పూర్తి నియంత్రణ ఉంటుంది. దీంతో గోప్యతతో పాటు భద్రత పెరుగుతుంది. ఒకసారి చాట్‌ను లాక్‌ (Lock Chat) చేస్తే.. కేవలం యూజర్‌ మాత్రమే ఫింగర్‌ ప్రింట్‌ లేదా పాస్‌కోడ్‌ ద్వారా దాన్ని చూడగలుగుతారు. ఫలితంగా ఇతరులెవరూ లాక్‌ చేసిన చాట్‌ను తెరవడం కుదరదు. ఒకవేళ ఎవరైనా ఫోన్‌ తీసుకొని లాక్‌ చేసిన చాట్‌ను పాస్‌కోడ్‌ లేదా ఫింగర్‌ప్రింట్‌ లేకుండా చూడాలని ప్రయత్నిస్తే.. ఆ చాట్‌ మొత్తాన్ని చెరిపేయాలని కోరుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని