logo

TiE Global Summit: 12 నుంచి మూడు రోజుల పాటు టీఐఈ గ్లోబల్‌ సమ్మిట్‌

ది ఇండస్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ (TiE) గ్లోబల్‌ సమ్మిట్‌ డిసెంబర్‌ 12న ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హెచ్‌ఐసీసీ ప్రాంగణం ఇందుకు వేదిక కానుంది.

Updated : 09 Dec 2022 19:09 IST

హైదరాబాద్‌: అతిపెద్ద పారిశ్రామిక వేత్తల సదస్సు అయిన ది ఇండస్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ (TiE) గ్లోబల్‌ సమ్మిట్‌ డిసెంబర్‌ 12న ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హెచ్‌ఐసీసీ ప్రాంగణం ఇందుకు వేదిక కానుంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, అడోబ్‌ సిస్టమ్స్‌ సీఈఓ శంతను నారాయణ్‌, గోయెంకా గ్రూప్‌ సీఈఓ, ఎండీ అనిల్‌ కుమార్‌ చలమలశెట్టి సమక్షంలో ఈ సదస్సు ప్రారంభం కానుంది. 

మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 2,500 మంది ప్రతినిధులు, 17 దేశాలకు చెందిన 550 మందికి పైగా టీఐఈ చార్టర్‌ మెంబర్స్, 150 మందికి పైగా గ్లోబల్‌ స్పీకర్స్‌, 200 మందికి పైగా పెట్టుబడిదారులు హాజరుకానున్నారు. ప్రముఖ ఆంత్రప్రెన్యూర్‌ కిరణ్‌ పటేల్‌ కీలకోపన్యాసం చేయనున్నారని నిర్వాహకులు తెలిపారు. ఉడాన్‌.కామ్‌, అర్బన్‌ లేడర్‌, బిరా 91, డ్రూమ్‌, షాప్‌క్లూస్‌ వంటి విజయవంతమైన పారిశ్రామిక వేత్తలు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. విభిన్న రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు తమ ఆలోచనలు పంచుకోవడానికి టీజీఎస్‌-22 (TiE Global summit) వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు TiE గ్లోబల్‌ వైస్‌ ఛైర్మన్‌ మురళీ బుక్కపట్నం, టీఐఈ హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ సురేశ్‌ రాజు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని