logo

కంటైనర్లు కావు.. జనరేటర్లు

పెద్దపెద్ద ట్రక్కుల్లో ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద కనిపిస్తున్న ఈ సామగ్రిని చూస్తే ఓడల్లో తరలించే కంటైనర్లలా కనిపిస్తున్నాయి కదూ?  కానీ ఇవి డీజిల్‌తో నడిచే జనరేటర్లు.

Published : 02 Feb 2023 02:55 IST

పెద్దపెద్ద ట్రక్కుల్లో ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద కనిపిస్తున్న ఈ సామగ్రిని చూస్తే ఓడల్లో తరలించే కంటైనర్లలా కనిపిస్తున్నాయి కదూ?  కానీ ఇవి డీజిల్‌తో నడిచే జనరేటర్లు. ఈ నెల 11న నగరంలో జరిగే ఫార్ములా-ఈ రేసు సందర్భంగా విద్యుత్తు కార్ల ఛార్జింగ్‌, ఇతర అవసరాల కోసం దేశంలోని పలు నగరాల నుంచి భారీ జనరేటర్లను తీసుకొచ్చారు. ఒక్కోటి 500-1700 కిలోవాట్ల సామర్థ్యం కలవి. మొత్తం 20 వరకు ఇక్కడికి తరలించారు. రేసర్ల పెవిలియన్‌తోపాటు నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌ తదితర చోట్ల వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని