logo

భూమా అఖిలప్రియను అడ్డుకున్న పోలీసులు

ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యర్రగుంట్ల వద్ద సీఎం జగన్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

Updated : 28 Mar 2024 17:57 IST

ఆళ్లగడ్డ గ్రామీణం: ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యర్రగుంట్ల వద్ద సీఎం జగన్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.  రుద్రవరం మండలానికి చెందిన రైతులకు సాగునీటి విడుదలలో జరుగుతున్న జాప్యం గురించి సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు అఖిలప్రియ, తెదేపా నేతలతో కలిసి సభ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు చెప్పడంతో ఆమె వినతిపత్రం ఇచ్చేందుకు కొందరు రైతులను మాత్రమే పంపించారు. వారు సభ వద్దకు వెళుతుండగా మధ్యలో వైకాపా నాయకుడు అడ్డుకొని దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే దాడి చేయడం ఏమిటని అఖిలప్రియ పోలీసులను ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు సిరివెళ్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని