పెద్దమ్మను ఎలా మార్చుకోవాలి...
మా పెదనాన్న చనిపోయి ఏడాది అయినా పెద్దమ్మ ఇంకా ఆ దుఃఖం నుంచి బయటకు రాలేదు. మునుపు ఎంతో చలాకీగా ఉంటూ అందరితో కలివిడిగా మాట్లాడేది. కిట్టీ పార్టీలూ, సినిమాలూ అంటూ హుషారుగా వెళ్తుండేది. అలాంటిది ఇప్పుడు ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్లడం లేదు.
మా పెదనాన్న చనిపోయి ఏడాది అయినా పెద్దమ్మ ఇంకా ఆ దుఃఖం నుంచి బయటకు రాలేదు. మునుపు ఎంతో చలాకీగా ఉంటూ అందరితో కలివిడిగా మాట్లాడేది. కిట్టీ పార్టీలూ, సినిమాలూ అంటూ హుషారుగా వెళ్తుండేది. అలాంటిది ఇప్పుడు ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్లడం లేదు. ఇంట్లో కూడా ఎప్పుడూ దిగులుగా దేనిపైనా ఆసక్తి లేకుండా ఉంటోంది. ఏం చేస్తే పెద్దమ్మలో మార్పు వస్తుంది?
- ఒక సోదరి
చాలా దగ్గరగా ఉన్న భర్త కానీ ఇతర సంబంధీకులు కానీ చనిపోయినప్పుడు దుఃఖంలో కూరుకుపోవడం సహజమే. ఆత్మీయులు దూరమైన వేదన సాధారణంగా ఆరునెలల లోపల తగ్గుతుంది. ఏదో విధంగా సర్దుబాటు చేసుకుని ఆ దుఃఖ తీవ్రత నుంచి బయటపడతారు. మీ పెద్దమ్మ వయసులో పెద్దది కావడాన, భర్తతో అనేక సంవత్సరాల అనుబంధం ఉండి.. ఇప్పుడు ఆయన సాహచర్యాన్ని కోల్పోవడం దుర్భరంగా ఉంది. దీన్ని కాంప్లికేటెడ్ గ్రీఫ్ అంటారు. ముందు చలాకీగా ఉండే ఆమె ఇంత నిరాశగా మారిపోవడం, బయటకు వెళ్లకపోవడం, ఎవరితో కలవకపోవడం, నిరుత్సాహం, ఎప్పుడూ దిగులుగా ఉండటం.. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు. మీరు చెప్పిన విషయాలను బట్టి ఆమెలో డిప్రెషన్ తీవ్ర స్థాయిలో ఉంది. అంటే గ్రీఫ్ రియాక్షన్‌ను మించి వెళ్లారామె. ఇటువంటి పరిస్థితిలో ఆమెను బలవంతంగానైనా సైకియాట్రిస్టుకు చూపించడం అవసరం. ఆవిడున్న స్థితిలో కౌన్సెలింగ్ వల్ల ప్రయోజనం ఉండదు. యాంటీ డిప్రెసెంట్లు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. రెండు, మూడు నెలల పాటు వాటిని వాడటం వల్ల ఆమె స్థితిలో మార్పు వస్తుంది. తక్షణం మానసిక నిపుణులను సంప్రదించండి. అవసరాన్ని బట్టి ట్రాన్స్‌క్రీనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ (టీఎంఎస్) ట్రీట్‌మెంట్ ఇస్తే డిప్రెషన్ నుంచి త్వరగా కోలుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.