Mahindra XUV700: నయా లుక్‌లో మహీంద్రా XUV700.. ధర, ఫీచర్లు ఇవే!

New Mahindra XUV700 launched: మహీంద్రా కొత్త ఎక్స్‌యూవీ700ను లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.13.99 లక్షలుగా నిర్ణయించింది.

Published : 16 Jan 2024 02:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆధునీకరించిన కొత్త ఎక్స్‌యూవీ 700ను (Mahindra XUV700) లాంఛ్‌ చేసింది. దీని ధర రూ.13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. గరిష్ఠ ధర రూ.23.99 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) ఉంది. జనవరి 15 నుంచి బుకింగ్స్‌ మొదలయ్యాయి. జనవరి 25 నుంచి డీలర్ల వద్ద డెమో వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా ఏమేం మార్పులు తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాం..

కొత్త ఎక్స్‌యూవీ700 ఐదు వేరియంట్లలో వస్తోంది. ఐదు, ఆరు, ఏడు సీట్ల ఆప్షన్లతో వస్తోంది. MX, AX3, AX5, AX7, AX7L వేరియంట్లలో లభిస్తుంది. ఇంజిన్‌ పరంగా ఎలాంటి మార్పులూ చేయనప్పటికీ కాస్మోటిక్‌ పరంగా, ఫీచర్ల పరంగా కొన్ని మార్పులు చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో లభిస్తోంది. పెట్రోల్‌ మోడల్‌ 2.0 లీటర్ల టర్బోఛార్జ్‌డ్‌ ఇంజిన్‌తో వస్తుండగా.. డీజిల్‌ మోడల్‌ 2.2 లీటర్‌ టర్బో డీజిల్‌ మోటార్‌తో వస్తోంది. పాత మోడల్‌లో ఉన్న పవర్‌ను, టార్క్‌నే కొనసాగించారు.

ఫాస్టాగ్‌కు కేవైసీ.. జనవరి 31 డెడ్‌లైన్‌!

2024 ఎక్స్‌యూవీలో నాపోలీ బ్లాక్‌ కలర్‌ ఆప్షన్‌ను తీసుకురావడం కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా AX7L, AX7 వేరియంట్లలో ఈ కలర్‌ ఎస్‌యూవీకి మరింత ఫ్రెష్‌ లుక్‌ను తీసుకొచ్చింది. ఈ రెండు మోడళ్లలో డ్యూయల్‌ టోన్‌ ఎక్స్‌టీరియర్‌ ఆప్షన్‌తో వస్తోంది. కొత్త ఎక్స్‌యూవీలో అడ్రెనోక్స్‌ సూట్‌ ఉంది. ఇందులో భాగంగా ఇన్‌బిల్ట్‌ ఇ-సిమ్‌ ద్వారా ఓవర్‌ ది ఎయిర్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు అందుతాయి. కొత్తగా చేర్చిన 13 ఫీచర్లతో కలిపి మొత్తం 83 కనెక్టెడ్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎం లెన్స్‌, టోల్‌ డెయిరీ వంటి ఫీచర్లు కొత్తగా జత చేసిన వాటిలో ఉన్నాయి. ‘ఆస్క్‌ మహీంద్రా’ పేరిట పర్సనల్‌ అసిస్టెంట్‌ సదుపాయాన్ని తీసుకొచ్చారు. త్వరగా డెలివరీలను అందించేందుకు ప్రొడక్షన్‌ కెపాసిటీని మహీంద్రా వేగవంతం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని