Aadhaar: పదేళ్లు దాటినా ఆధార్‌ అప్‌డేట్‌ చేయలేదా? ఉచిత అప్‌డేషన్‌ మరి కొన్నిరోజులే!

Aadhaar update For Free: ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు ఉడాయ్‌ ఇచ్చిన గడువు డిసెంబర్‌ 14తో ముగియనుంది. ఇంకా వివరాలు అప్‌డేట్ చేసుకోకపోతే వెంటనే అప్‌డేట్ చేసుకోండి.

Published : 22 Nov 2023 17:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధార్‌ (Aadhaar) తీసుకుని పదేళ్లు దాటిందా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయలేదా? అయితే ఆధార్‌ వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్‌ వివరాలను ఉచితంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకునేందుకు ఇచ్చిన గడువును విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) గడువు త్వరలో ముగియనుంది. 2023 డిసెంబర్‌ 14 వరకు ఉచితంగా ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. గడువు తర్వాత ఆధార్‌ డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఆధార్‌ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు తగిన పత్రాలు సమర్పించి అందులో పొందుపరిచిన వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ గతంలో సూచించింది. ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్లకోసారి గుర్తింపుకార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సెంట్రల్‌ ఐడెంటిటీస్‌ డేటా రిపాజిటరీ-సీఐడీఆర్‌)లోని వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సీఐడీఆర్‌ వద్ద ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది.

ఈ యాప్స్‌ వాడొద్దు.. యూజర్లకు గూగుల్‌ పే అలర్ట్‌

ఆధార్‌ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్‌ వివరాలు అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి లేటెస్ట్‌ గుర్తింపు కార్డు, అడ్రస్‌ వివరాలను సబ్మిట్‌ చేయాలి. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్‌, పాన్‌/ఇ-ప్యాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని ఉడాయ్‌ తెలిపింది. విద్యుత్‌, నీటి, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వినియోగించ్చుకోవచ్చని ఉడాయ్‌ పేర్కొంది. ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన స్కాన్డ్‌ కాపీలను ‘మై ఆధార్‌’ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూడొచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని