Apple Devices: ఐఓఎస్‌ యూజర్లకు కేంద్రం సూచన.. అప్‌డేట్ విడుదల చేసిన యాపిల్‌

ఐఫోన్‌ యూజర్లకు యాపిల్‌ కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌ను విడుదల చేసింది. యూజర్లు తమ డివైజ్‌లలో లేటెస్ట్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

Updated : 29 Sep 2023 13:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపిల్‌ యూజర్లకు కొద్ది రోజుల క్రితం కేంద్రం భద్రతాపరమైన అలర్ట్ జారీ చేసింది. ఐఫోన్‌, ఐపాడ్‌, యాపిల్‌ వాచ్‌, మ్యాక్‌బుక్‌తోపాటు సఫారీ బ్రౌజర్‌లో సెక్యూరిటీ లోపం ఉందని భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (CERT-In) గుర్తించినట్లు తెలిపింది. సెర్ట్‌-ఇన్‌ విడుదల చేసిన జాబితాలో ఐఓఎస్‌ 17.0.1 కూడా ఉంది. ఐఫోన్లలో లేటెస్ట్‌ ఓఎస్‌ ఇదే కావడంతో తమ డేటా భద్రతపై యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో యూపిల్‌ త్వరగా కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా యాపిల్‌ ఐఓఎస్‌ 17.0.2 వెర్షన్‌ను విడుదల చేసింది. యూజర్లు తమ డివైజ్‌లలో కొత్త ఓఎస్‌ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. 

విండోస్‌ 11 కొత్త అప్‌డేట్‌.. మీ పనులన్నింటికీ ‘కోపైలట్‌’!

లేటెస్ట్‌ వెర్షన్‌ ఓఎస్‌ కోసం ఐఫోన్‌ సెట్టింగ్స్ ఓపెన్‌చేసి జనరల్‌ సెక్షన్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌పై క్లిక్‌ చేస్తే ఐఓఎస్‌ 17.0.2 అప్‌డేట్‌ అవుతుంది. ఇదే పద్ధతిలో ఐపాడ్‌, మ్యాక్‌, వాచ్‌, సఫారీ యూజర్లు కూడా తమ డివైజ్‌లలో కొత్త ఓఎస్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. సెర్ట్‌-ఇన్‌ నివేదిక ప్రకారం యాపిల్‌ డివైజ్‌లలోని సెక్యూరిటీ, వెబ్‌కిట్‌ కాంపోనెంట్‌లోని లోపాల కారణంగా సైబర్‌ నేరగాళ్లు యూజర్లకు మాల్‌వేర్‌ లింక్స్‌, మెసేజ్‌లను పంపి వ్యక్తిగత సమాచారం దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని