Automobile exports: 2023లో 21% తగ్గిన వాహన ఎగుమతులు

Automobile exports:  2022లో 52,04,966 యూనిట్ల వాహనాలు ఎగుమతి కాగా.. గత ఏడాది అవి 42,85,809 యూనిట్లకు పరిమితమయ్యాయి.

Updated : 14 Jan 2024 12:53 IST

దిల్లీ: గత ఏడాది వాహన ఎగుమతులు (Automobile exports) 21 శాతం తగ్గినట్లు ‘వాహన తయారీదార్ల సమాఖ్య (SIAM)’ వెల్లడించింది. విదేశీ మార్కెట్లలో ఆర్థిక, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు కొనసాగుతుండటమే దీనికి కారణమని పేర్కొంది. 2022లో 52,04,966 యూనిట్ల వాహనాలు ఎగుమతి కాగా.. గత ఏడాది అవి 42,85,809 యూనిట్లకు పరిమితమయ్యాయి.

  • ప్రయాణికుల వాహన (Passenger vehicles) ఎగుమతులు 6,44,842 యూనిట్ల నుంచి అయిదు శాతం పెరిగి 6,77,956 యూనిట్లకు చేరాయి.
  • ద్విచక్ర వాహన ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 2023లో 20 శాతం తగ్గి 32,43,673 యూనిట్లకు కుంగాయి.
  • 2022లో 88,305 యూనిట్ల వాణిజ్య వాహనాలు విదేశాలకు సరఫరా కాగా.. ఆ సంఖ్య 2023లో 68,473 యూనిట్లకు తగ్గాయి.
  • త్రిచక్ర వాహన ఎగుమతులు 30 శాతం తగ్గి 4,17,178 యూనిట్ల నుంచి 2,91,919 యూనిట్లకు చేరాయి.
  • 2023లో కొత్త మోడళ్ల విడుదల; దక్షిణాఫ్రికా, గల్ఫ్‌ ప్రాంతంలో డిమాండ్ పుంజుకోవటం వంటి కారణాలు ప్రయాణికుల వాహనాల్లో ఎగుమతులు పెరగటానికి దోహదం చేసినట్లు సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మేనన్‌ తెలిపారు. సరఫరా గొలుసులో (supply chain) నెలకొన్న ఇబ్బందులు తొలగిపోవటం కూడా పెరుగుదలకు ఊతమిచ్చినట్లు వెల్లడించారు.
  • ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- డిసెంబర్‌ మధ్య మారుతీ సుజుకీ అత్యధికంగా 2,02,786 యూనిట్లు ఎగుమతి చేసినట్లు వెల్లడించారు. 2022 ఇదే కాలంతో పోలిస్తే ఆరు శాతం అధికం. అదే సమయంలో కియా ఇండియా ఎగుమతులు 33,872 యూనిట్ల నుంచి 47,792 యూనిట్లకు పెరిగాయి. నిస్సాన్‌ 31,678 యూనిట్లు, హోండా కార్స్‌ 20,262 యూనిట్లు ఎగుమతి చేసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని