Home Loan: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌ నుంచి హోమ్‌లోన్‌ ఆఫర్

ప్రముఖ 'ఎన్‌బీఎఫ్‌సీ' బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తన గృహ రుణ వినియోగదారులకు..ప్రారంభంలో తక్కువ ఈఎంఐను చెల్లించే విధంగా ఆఫర్‌ను ప్రకటించింది.

Updated : 25 Nov 2022 13:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గృహ రుణ కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (Bajaj housing finance) 'మై ఈఎంఐ' ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద ఇంటి రుణ దరఖాస్తుదారులు ప్రారంభ కాలవ్యవధిలో తక్కువ మొత్తంలో ఈఎంఐను చెల్లించే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. ఈ పథకం కారణంగా గృహ రుణ వినియోగదారులకు ఆర్థిక ఒత్తిడి ప్రారంభంలో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇంటి రుణ మొత్తంలో ఈఎంఐగా కేవలం 0.1 శాతాన్ని, గరిష్ఠంగా 3 సంవత్సరాల పాటు చెల్లించొచ్చు. కనీస ఈఎంఐ రూ.4,999 చెల్లించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలు లేదా గృహ సముదాయ ప్రాజెక్ట్‌ పూర్తయ్యే వరకు ఇదే ఈఎంఐను చెల్లించినా సరిపోతుంది. ఏది ముందుగా వస్తే అది వర్తిస్తుంది.

అసలు రుణ ఈఎంఐ మొత్తం, కాలవ్యవధి తర్వాత ప్రారంభమవుతుంది. ఈ ఆఫర్‌ వల్ల రుణగ్రహీతలకు ప్రారంభ వ్యవధిలో చాలా తక్కువ స్థాయిలో ఈఎంఐ ఉండడం వల్ల ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు రుణ ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అసలు ఈఎంఐ ప్రారంభమవ్వడానికి సమయం ఉండడం ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా ప్రాజెక్ట్‌ ప్రారంభయ్యేటప్పుడు ఉండే ఇంటి ధర ప్రాజెక్ట్‌ పూర్తయ్యేటప్పటికి ఉండదు. చాలా పెరిగిపోతుంది. ఇదంతా గృహ కొనుగోలుదారునికి ఆర్థికంగా బాగా కలిసివచ్చేదే. బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 'మై ఈఎంఐ' ఆఫర్‌ కింద ఇంటి రుణాన్ని ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేయొచ్చు. ఈ రుణానికి వార్షిక వడ్డీ రేట్లు 8.20% నుంచి ప్రారంభమవుతున్నాయి. 2022 డిసెంబర్‌ 5 వరకు ఈ ఆఫర్‌ అమల్లో ఉంటుంది.

చివరిగా: మై ఈఎంఐ ఆఫర్‌ను తీసుకుంటే, ప్రారంభంలో అసలు/వడ్డీ ఎక్కువ చెల్లించరు. కాబట్టి 3 ఏళ్ల తర్వాత ఇది మీ మొత్తం రుణ (ఈఎంఐ/కాలపరిమితి) పెరుగుదలలో ఎంత ఎక్కువ ప్రభావం చూపుతుందో కూడా లెక్కించాలి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు గృహ రుణ వినియోగదారులు ఈఎంఐను ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా చెల్లించడం ఎల్లప్పుడూ మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని