Stock Market: వరుస నష్టాలకు బ్రేక్‌.. లాభాలతో ముగిసిన సూచీలు

Stock Market Closing Bell: ఈ వారాంతాన్ని దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ముగించాయి. సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్లు ఎగబాకగా.. నిఫ్టీ 21,600 మార్క్‌ దాటింది.

Published : 19 Jan 2024 15:55 IST

ముంబయి: మూడు రోజుల వరుస నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు (Stock Market) కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా వెల్లువెత్తిన కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. ఫలితంగా శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు లాభాలను దక్కించుకున్నాయి. సెన్సెక్స్‌ (Sensex) దాదాపు 500 పాయింట్లు ఎగబాకగా.. నిఫ్టీ (Nifty) 21,600 మార్క్‌ దాటింది.

క్రితం సెషన్‌లో 71,186 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్‌ (BSE).. ఈ ఉదయం 600 పాయింట్లకు పైగా లాభంతో 71,786.74 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో 71,895.64 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మధ్యలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో కాస్త ఒత్తిడికి గురైన సూచీ చివరకు 496.37 పాయింట్లు లాభపడి 71,683.23 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ (NSE) 160.15 పాయింట్లు పెరిగి 21,622.40 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి 83.06గా ముగిసింది.

నేటి ట్రేడింగ్‌లో దాదాపు అన్ని రంగాల సూచీలు రాణించాయి. నిఫ్టీలో ఓఎన్జీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్టీపీసీ, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ షేర్లు లాభపడగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, దివిస్‌ ల్యాబ్స్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, లోహ, చమురు రంగ సూచీలు 1-2శాతం మేర పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని