Bill Gates: హ్యాపీబర్త్‌డే విండోస్‌.. స్పెషల్‌ గిఫ్‌ షేర్‌ చేసిన బిల్ గేట్స్‌

విండోస్‌ ఓఎస్‌ విడుదలై 28 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) విండోస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

Updated : 25 Aug 2023 13:07 IST

కాలిఫోర్నియా: కంప్యూటర్‌ ఓఎస్‌ అనగానే విండోస్‌ (Windows) పేరు టక్కున చెప్పేస్తాం. మార్కెట్లో ఎన్ని కొత్త ఓఎస్‌లు వచ్చినా విండోస్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ ప్రత్యేకం. అందుకే, మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ అభివృద్ధి చేసిన విండోస్‌ ఓఎస్‌నే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఈ ఓఎస్‌ విడుదలై 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) విండోస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక గిఫ్‌ (GIF)ను సోషల్‌ మీడియాలో షేర్‌  చేశారు. ‘‘కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మీతో ఉండిపోతాయి. 28 ఏళ్లుగా మిమ్మల్ని ఎంతోమంది అనుసరిస్తున్నారు. హ్యాపీ బర్త్‌డే విండోస్‌’’ అని బిల్ గేట్స్‌ ట్వీట్‌ చేశారు.

రశీదు అడగండి.. అప్‌లోడ్‌ చేయండి.. రూ.కోటి బహుమతి పొందండి

1995లో తీసిన ఓ వీడియోకు సంబంధించిన ఈ గిఫ్‌లో.. విండోస్‌ విడుదల సందర్భంగా బిల్‌ గేట్స్‌తోపాటు అప్పటి మైక్రోసాఫ్ట్‌ సీఈవో స్టీవ్‌ బాల్‌మర్‌ వేదికపై ఆనందంతో డ్యాన్స్‌ చేస్తూ కన్పించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ తొలిసారిగా 1995, ఆగస్టు 24న విండోస్‌ 95ను 32-బిట్‌ సిస్టమ్‌తో విడుదల చేసింది. తర్వాతి కాలంలో వేర్వేరు వెర్షన్లలతో విండోస్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ, స్టార్ట్‌ బటన్‌, రీసైకిల్ బిన్‌ వంటి కొన్ని ఫీచర్లలో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. విండోస్‌ 95కు ముందు విండోస్‌ 1.0, విండోస్‌ 2.0, విండోస్‌ 3.0 వంటివి మైక్రోసాఫ్ట్ డిస్క్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ (MS DOS)లుగా మాత్రమే ఉండేవి. వాటిని గ్రాఫికల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లుగా పరిగణించేవారు. దీంతో పర్సనల్‌ కంప్యూటర్స్‌ కోసం 1995లో గ్రాఫికల్‌ యూజర్‌ ఇంటర్‌ఫేజ్‌ ఓఎస్‌గా విండోస్‌ 95ను పరిచయం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని