BMW X7: భారత్‌లోకి బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధర ₹ 1.22 కోట్లు!
బీఎండబ్ల్యూ 2023 మోడల్ ఎక్స్7 ఎస్‌యూవీలో నాలుగు డ్రైవ్ మోడ్‌లు ఇస్తున్నారు. లగ్జరీ, వేగం, పవర్ కలయికగా కంపెనీ ఈ కారును అభివృద్ధి చేసింది. మార్చి 2023 నుంచి కారు డెలివరీలు ప్రారంభించనున్నారు.
ముంబయి: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ ఇండియా 2023 మోడల్ ఎక్స్7 (BMW X7) కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. బీఎండబ్ల్యూ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ X7 xDrive40i M Sport ధర ₹ 1.22 కోట్లు (Ex-showroom), డీజిల్ ఇంజిన్ వేరియంట్ X7 xDrive40d M Sport ధర ₹ 1.25 కోట్లు (Ex-showroom)గా కంపెనీ నిర్ణయించింది. ఈ కారును విడిభాగాలుగా దిగుమతి చేసుకుని బీఎండబ్ల్యూ చెన్నై ప్లాంట్‌లో వీటిని అసెంబుల్ చేయనున్నారు. మార్చి 2023 నుంచి కారు డెలివరీలు ప్రారంభంకానున్నాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్7 కారులో ఆరు సిలిండర్లతో 3.0 లీటర్ల ఇంజిన్‌ను అమర్చారు. పెట్రలో ఇంజిన్ 5,200-6,250 ఆర్‌పీఎం వద్ద 375 బీహెచ్‌పీ శక్తిని, 1,850-5,000 ఆర్‌పీఎం వద్ద 520 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇక, డీజిల్ ఇంజిన్ 4,400 ఆర్‌పీఎం వద్ద 335 బీహెచ్‌పీ శక్తిని, 1,750-2,250 ఆర్‌పీఎం వద్ద 700 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్‌లకు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను ఇచ్చారు. కేవలం 5.8 సెకన్ల వ్యవధిలో 0-100 km వేగాన్ని అందుకుంటుంది. కంఫర్ట్, ఎఫిషియంట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్ అని నాలుగు డ్రైవ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం ఇందులో అత్యాధునిక ఫీచర్లు ఇస్తున్నారు.
‘‘బీఎండబ్ల్యూ ఎక్స్ సిరీస్‌లో ఎక్స్7కు ప్రత్యేక స్థానం ఉంది. లగ్జరీ, వేగం, పవర్ కలయికగా కంపెనీ ఈ కారును అభివృద్ధి చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్‌తో వస్తున్న 2023 బీఎండబ్ల్యూ ఎక్స్7 వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటుంది’’ అని భావిస్తున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Crime News
గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
-
Ap-top-news News
అభివృద్ధి లేదు.. ఆత్మహత్య చేసుకుంటా.. జంగారెడ్డిగూడెంలో ఓ కౌన్సిలర్ ఆవేదన
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
Ts-top-news News
నేటి నుంచి బీఎస్-6.2 నిబంధన అమలు
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం