Personal Loan: వ్యక్తిగత రుణం రిజెక్ట్ అయ్యిందా? కారణాలు ఇవే కావచ్చు..
ముఖ్యంగా ఏ కారణాల చేత బ్యాంకులు, వ్యక్తిగత రుణ దరఖాస్తును తిరస్కరిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: వ్యక్తిగత రుణాలు (Personal Loan) అనేది ఎటువంటి హామీ లేకుండా.. అవసరం ఏమిటన్నది చెప్పకుండా తీసుకోవచ్చు. కాబట్టి స్వల్ప, మధ్య కాలిక అవసరాలకు చాలామంది వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తుంటారు. అయితే వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకులు కొన్నిసార్లు దరఖాస్తును తిరస్కరిస్తాయి. ముఖ్యంగా ఏ కారణాల చేత తిరస్కరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెడిట్ స్కోరు..
సాధారణంగా క్రెడిట్ స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఇది దరఖాస్తుదారుని క్రెడిట్ యోగ్యతను తెలియజేస్తుంది. అందువల్ల బ్యాంకులు వ్యక్తిగత రుణ విషయంలో ముందుగా క్రెడిట్ స్కోరును పరిశీలిస్తాయి. దీనికి కొంత లిమిట్‌ను పెట్టుకుంటాయి. ఈ పరిమితి కంటే తక్కువగా ఉంటే దరఖాస్తు తిరస్కరిస్తాయి. అంతేకాకుండా ఏ విధమైన క్రెడిట్ చరిత్రా లేకపోయినా, ఆర్థిక అలవాట్లను అంచనా వేసేందుకు వీలుండదు కాబట్టి రుణ దరఖాస్తును తిరస్కరించవచ్చు.
ఏం చేయాలి?: సాధారణంగా 750 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు నిర్వహించేవారికి వ్యక్తిగత రుణం సులభంగా లభిస్తుంది. 650 కంటే ఎక్కువ ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అంతకంటే తక్కువగా ఉంటే వ్యక్తిగత రుణం లభించడం కష్టం. కాబట్టి ముందుగా క్రెడిట్ స్కోరు తనిఖీ చేయాలి. తక్కువగా ఉంటే మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. కొన్ని ఎన్బీఎఫ్సీలు తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తాయి. అయితే వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఎటువంటి క్రెడిట్ చరిత్రా లేకుంటే శాలరీ స్లిప్‌లు, డిపాజిట్లు వంటి వాటిని చూపించి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆదాయం, ఖర్చులు..
రుణ తిరిగి చెల్లింపుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు బ్యాంకులు మీ ఆదాయాన్ని తనిఖీ చేస్తాయి. కనీస ఆదాయం లేకుంటే బ్యాంకులు రుణాన్ని మంజూరు చేయవు. అలాగే ఎక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎఫ్ఓఐఆర్ (ఫిక్స్డ్ అబ్లిగేషన్స్ టు ఇన్కమ్ రేషియో) ఎక్కువగా ఉంటే వ్యక్తిగత రుణాన్ని తిరస్కరిస్తాయి.
ఏం చేయాలి? : రుణం తీసుకునే ముందు రుణదాతతో మాట్లాడండి. ఇంటి అద్దె, క్రెడిట్ కార్డు బిల్లులు, ఇతర రుణాల ఈఎంఐలుతో సహా ప్రతి నెలా క్రమం తప్పకుండా తీర్చవలసిన అన్ని స్థిర బాధ్యతలు ఎఫ్ఓఐఆర్ కిందికి వస్తాయి. ఎఫ్ఓఐఆర్ ఎంత తక్కువగా ఉంటే.. రుణం తీర్చేందుకు అంత ఎక్కువ వెలుసుబాటు ఉంటుంది. కాబట్టి ఎఫ్ఓఐఆర్ 40% కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవడం మంచిది.
బహుళ దరఖాస్తులు..
వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంకులు క్రెడిట్ స్కోరు కోసం బ్యూరోని సంప్రదిస్తాయి. వీటిని హార్డ్ ఎంక్వైరీలు అంటారు. ఎక్కువ హార్డ్ ఎంక్వైరీలు.. రుణ అవసరాలు ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తాయి. దీంతో క్రెడిట్ స్కోరుపై చెడు ప్రభావం పడి, విశ్వసనీయత తగ్గుతుంది. దీంతో బ్యాంకులు మీ దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంది.
ఏంచేయాలి?: రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు మీ ఆదాయం, క్రెడిట్ స్కోరుతో అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా తనిఖీ చేసి దరఖాస్తు చేసుకోండి. ఒక్కసారి దరఖాస్తు తిరస్కరణకు గురైతే.. దానికి గల కారణాలను తెలుసుకోండి. వాటిని సరిచేసుకున్నాకే మళ్లీ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి.
అధిక రుణాలు..
ప్రస్తుతం ఉన్న అప్పులు కూడా వ్యక్తిగత రుణ దరఖాస్తు తిరస్కరణకు కారణం కావచ్చు. మీకు ఇప్పటికే ఒకటి ఎక్కువ రుణ ఖాతాలు, క్రెడిట్ కార్డు రుణాలు వంటివి ఉంటే.. మీపై ఇప్పటికే అధిక భారం ఉన్నట్లు రుణదాత భావిస్తారు. ఎగవేతకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు పరిగణించి దరఖాస్తును తిరస్కరిస్తారు. కొంత మంది చెల్లింపుల సామర్ధ్యం ఎక్కువగా ఉందని చూపించుకునేందుకు ప్రస్తుతం చెల్లిస్తున్న లోన్ వివరాలు తెలుపక పోవడం లేదా ఈఎంఐలు తగ్గించుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే క్రెడిట్ బ్యూరోలు ఇచ్చే నివేదికలో ప్రస్తుతం మీకున్న రుణాలు అన్ని సులభంగా తెలిసిపోతాయి. కాబట్టి దాచిపెట్టిన దరఖాస్తు తిరస్కరణకు గురికావడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు.
ఏం చేయాలి? : మీ చెల్లింపుల సామర్థ్యం ప్రకారం అవసరమైనప్పుడు మాత్రమే రుణాలు, క్రెడిట్ కార్డులను తీసుకున్నారని నిర్ధారించుకోండి. ఒకే సమయంలో ఎక్కువ రుణాలు లేకుండా చేసుకోండి.
చివరిగా..
రుణదాతలు.. వ్యక్తిగత రుణాన్ని ఆమోదించేటప్పుడు వ్యక్తి వయసు, స్థిరమైన ఉపాధి, ఆదాయ రికార్డులు వంటివి కూడా చూస్తారు. కాబట్టి రుణ దరఖాస్తు జాగ్రత్తగా పూర్తి చేయాలి. వ్యక్తిగత రుణం అనేది అసురక్షిత రుణం కాబట్టి సాధారణంగానే వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రుణాల తీసుకునేముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08/02/23)
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Politics News
Kotamreddy: అమరావతి రైతులను పరామర్శించడమే నేను చేసిన నేరమా?: కోటంరెడ్డి
-
General News
TTD: ఫిబ్రవరి 9న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల