Maruti: మారుతీ మోడళ్లపై డిస్కౌంట్
మారుతీ ‘నెక్సా’ డీలర్లు మారుతీ సుజుకీకి చెందిన కొన్ని మోడళ్లపై డిస్కౌంట్ అందించనున్నారు, ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
మారుతీ సుజుకీ బలెనో, సియాజ్, ఇగ్నిస్‌లపై జూన్‌లో రూ.64,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను ‘నెక్సా’ డీలర్లు అందించనున్నారు. ఎక్స్చేంజ్ బోనస్‌లు, నగదు తగ్గింపులు, వివిధ కార్పొరేట్ ప్రయోజనాల ద్వారా వినియోగదార్లు ఈ మోడళ్లపై ఆఫర్లను పొందొచ్చు.
Ignis: మారుతీ నెక్సా లైనప్‌లో, ఇగ్నిస్ ఎంట్రీ లెవల్ మోడల్‌గా గుర్తింపు పొందింది. మాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్‌ల కోసం రూ.64 వేల వరకు గణనీయమైన తగ్గింపుతో లభించనుంది. ఈ తగ్గింపుల్లో రూ.35 వేల నగదు డిస్కౌంట్, గరిష్ఠంగా రూ.25 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ.4,000 కార్పొరేట్ ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇగ్నిస్ ప్రస్తుత ధర రూ.5.84 లక్షల నుంచి రూ.8.16 లక్షల మధ్య ఉంది.
Ciaz: నెక్సా లైనప్‌లోని పాత మోడల్ మారుతీ సుజుకీ సియాజ్‌పై ఈ నెలలో అన్ని వేరియంట్‌లపై రూ.33 వేల వరకు ప్రయోజనాలు పొందొచ్చు. వినియోగదార్లు గరిష్ఠంగా రూ.30 వేల విలువైన ఎక్స్చేంజ్ ఆఫర్లను, రూ.3 వేల కార్పొరేట్ తగ్గింపును పొందే అవకాశం ఉంది. అయితే, సియాజ్ కోసం ఎటువంటి నగదు తగ్గింపులు అందుబాటులో లేవు. సియాజ్ ప్రస్తుత ధర రూ.9.30 లక్షల నుంచి రూ.12.29 లక్షల మధ్య ఉంది.
Baleno: ఈ నెలలో, మారుతీ నెక్సా డీలర్లు బలెనోపై రూ.35 వేల వరకు తగ్గింపును అందజేస్తున్నారు. డెల్టా మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్‌లు రూ.15 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌తో పాటు రూ.20 వేల నగదు తగ్గింపునకు అర్హులు. ఇతర వేరియంట్‌లు రూ.10 వేల నగదు తగ్గింపును పొందుతాయి. అయితే, ఎక్స్చేంజ్ ఆఫర్ అలాగే ఉంటుంది. అదనంగా మారుతీ బలెనోకు సంబంధించిన అన్ని సీఎన్‌జీ వేరియంట్లపై రూ.25 వేల వరకు ప్రయోజనాలను అందించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.