రూ.5.1 కోట్ల నుంచి మెక్‌లారెన్‌ కారు

బ్రిటన్‌కు చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ మెక్‌లారెన్‌ ఆటోమోటివ్‌, తన హైబ్రిడ్‌ స్పోర్ట్స్‌ కారు ఆర్తూరాను మన దేశంలోకి ప్రవేశ పెట్టింది.

Updated : 27 May 2023 04:59 IST

దిల్లీ: బ్రిటన్‌కు చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ మెక్‌లారెన్‌ ఆటోమోటివ్‌, తన హైబ్రిడ్‌ స్పోర్ట్స్‌ కారు ఆర్తూరాను మన దేశంలోకి ప్రవేశ పెట్టింది. దీని ధర రూ.5.1 కోట్ల(ఎక్స్‌ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్లను బ్రిటన్‌ నుంచే దిగుమతి చేయనుంది. గరిష్ఠ వేగం గంటకు 330 కి.మీ.. కేవలం 3 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని, 8.3 సెకన్లలో 200 కి.మీ. వేగాన్ని ఇది అందుకుంటుందని సంస్థ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని