అత్యంత విశ్వసనీయ, ప్రఖ్యాత నేత మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చారని, తన అచంచలమైన సేవా భావంతో ఈ దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

Published : 28 May 2023 01:38 IST

సేవా భావంతోనే ఆ స్థాయికి
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చారని, తన అచంచలమైన సేవా భావంతో ఈ దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక జాతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. ‘గత ప్రభుత్వాల హయాంలో అవినీతి భారీగా జరిగింది. 2014లో మోదీ అధికారం చేపట్టిన తర్వాత అవినీతి ఊసే లేదు. ఈ 9 ఏళ్లలో ప్రభుత్వం వివిధ రంగాల్లో చాలా సాధించింది. ఒక్కో ఏడాది పూర్తవుతుంటే మెరుగైన పని తీరుతో ముందుకు సాగుతోంది. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై ప్రజలకు నమ్మకం వచ్చింది. ఆయన ఎప్పుడూ దేశానికి వ్యతిరేకంగా పని చేయరని, ఎలాంటి తప్పు చేయరని ప్రజలు నమ్ముతున్నారు. ఆయన కూడా దేశం కోసం ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నార’ని ఆమె పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు