జొమాటోకు తొలిసారిగా లాభాలు

ఆన్‌లైన్‌ ఆహార డెలివరీ సంస్థ జొమాటో తొలిసారిగా త్రైమాసిక లాభాన్ని నమోదుచేసింది. ఏప్రిల్‌-జూన్‌లో కంపెనీ రూ.2 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ఆర్జించింది.

Published : 04 Aug 2023 01:43 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ ఆహార డెలివరీ సంస్థ జొమాటో తొలిసారిగా త్రైమాసిక లాభాన్ని నమోదుచేసింది. ఏప్రిల్‌-జూన్‌లో కంపెనీ రూ.2 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.186 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1,414 కోట్ల నుంచి రూ.2,416 కోట్లకు వృద్ధి చెందింది. మొత్తం వ్యయాలు కూడా రూ.1,768 కోట్ల నుంచి రూ.2,612 కోట్లకు పెరిగాయి. ఆహార డెలివరీ వ్యాపార ఆదాయం రూ.1,470 కోట్ల నుంచి రూ.1,742 కోట్లకు పెరిగింది. బీ2బీ విభాగం హైపర్‌ప్యూర్‌ ఆదాయం రూ.273 కోట్ల నుంచి రూ.617 కోట్లకు చేరింది. సరకులు సరఫరా చేసే బ్లింకిట్‌ ఆదాయం రూ.164 కోట్ల నుంచి రూ.384 కోట్లకు పెరిగింది. వ్యాపారాన్ని సరళతరం చేయడానికి కృషి చేస్తున్నామని, వచ్చే నాలుగు త్రైమాసికాల్లో మొత్తం వ్యాపారం లాభాల్లోకి వస్తుందని జొమాటో ఎండీ, సీఈఓ దీపిందర్‌ గోయల్‌ వాటాదార్లకు రాసిన లేఖలో ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని