ఆల్ట్రోజ్‌ ఐసీఎన్‌జీ బుకింగ్‌ ప్రారంభం

ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పో 2023లో టాటా మోటార్స్‌ ప్రదర్శించిన ఆల్ట్రోజ్‌ ఐసీఎన్‌జీ కార్లకు వినియోగదార్ల నుంచి మంచి స్పందన వచ్చింది.

Updated : 20 Apr 2023 08:49 IST

మే నుంచి డెలివరీ 

దిల్లీ: ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పో 2023లో టాటా మోటార్స్‌ ప్రదర్శించిన ఆల్ట్రోజ్‌ ఐసీఎన్‌జీ కార్లకు వినియోగదార్ల నుంచి మంచి స్పందన వచ్చింది. దేశీయ తొలి ట్విన్‌ సిలిండర్‌ సీఎన్‌జీ సాంకేతికతతో రూపొందిన ఈ కార్లకు బుధవారం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని టాటా మోటార్స్‌ తెలిపింది. రూ.21,000 కనీస ధర చెల్లించి ఈ కార్లను బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. వచ్చే నెల నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపింది. ఆల్ట్రోజ్‌ శ్రేణిలో ప్రస్తుతం నాలుగో పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్‌లో ఐసీఎన్‌జీ వస్తోంది. ఇందులో 30 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు సిలిండర్లు, అధిక వినియోగ బూట్‌ స్థలం, థెర్మల్‌ ఇన్సిడెంట్‌ ప్రొటెక్షన్‌, గ్యాస్‌ లీక్‌ను గుర్తించే సదుపాయం, ఇంధనం నింపే సమయంలో కారు స్విచ్డ్‌ ఆఫ్‌ కోసం మైక్రో స్విచ్‌ వంటి పలు సదుపాయాలు ఈ కారులో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారెంటీతో ఇవి లభించనున్నాయి. ఆల్ట్రోజ్‌ ఐసీఎన్‌జీలో ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎం+, ఎక్స్‌జెడ్‌, ఎక్స్‌జెడ్‌+ వేరియంట్లు ఉన్నాయి. ఒపెరా బ్లూ, డౌన్‌టౌన్‌ రెడ్‌, ఆర్కేడ్‌ గ్రే, అవెన్యూ వైట్‌ రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. లెదర్‌ సీట్లు, ఐఆర్‌ఏ కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ, క్రూయిజ్‌ నియంత్రణ, ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్స్‌ తదితర ఫీచర్లు కూడా ఆల్ట్రోజ్‌ ఐసీఎన్‌జీల్లో ఉండనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని