ఒక ఛార్జింగ్‌తో 127 కి.మీ. ప్రయాణించే బజాజ్‌ చేతక్‌ విద్యుత్‌ స్కూటర్‌ 9న విడుదల

బజాజ్‌ ఆటో తాజాగా నవీకరించిన చేతక్‌ విద్యుత్‌ స్కూటర్‌ను ఈ నెల 9న విపణిలోకి విడుదల చేయబోతోంది. స్టైలింగ్‌, మెకానికల్స్‌లో సరైన, ప్రధాన సవరణలు చేసి, ఈ మోడల్‌ను తీసుకురాబోతోంది. ఈ విద్యుత్‌ స్కూటర్‌ 3.2 కిలోవాట్ అవర్‌ బ్యాటరీ ప్యాక్‌తో రాబోతోంది.

Updated : 02 Jan 2024 10:11 IST

దిల్లీ: బజాజ్‌ ఆటో తాజాగా నవీకరించిన చేతక్‌ విద్యుత్‌ స్కూటర్‌ను ఈ నెల 9న విపణిలోకి విడుదల చేయబోతోంది. స్టైలింగ్‌, మెకానికల్స్‌లో సరైన, ప్రధాన సవరణలు చేసి, ఈ మోడల్‌ను తీసుకురాబోతోంది. ఈ విద్యుత్‌ స్కూటర్‌ 3.2 కిలోవాట్ అవర్‌ బ్యాటరీ ప్యాక్‌తో రాబోతోంది. ఒకసారి ఛార్జింగ్‌తో (ఐడీసీ) 127 కి.మీ. ప్రయాణించొచ్చు. 0-100 శాతం ఛార్జింగ్‌ అయ్యేందుకు 4 గంటల 30 నిమిషాలు సమయం పడుతుందని సంస్థ తెలిపింది. ప్రస్తుత బజాజ్‌ చేతక్‌ విద్యుత్‌ స్కూటర్‌ గంటకు 63 కి.మీ. గరిష్ఠ వేగంతో నడుస్తుండగా, కొత్త మోడల్‌ 73 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని