ఈ ఏడాదిలో డుకాటి 8 కొత్త మోడళ్లు

ఇటలీకి చెందిన విలాస బైక్‌ల తయారీ సంస్థ డుకాటి, ఈ ఏడాది మన దేశంలో 8 కొత్త మోడళ్లను విడుదల చేస్తామని మంగళవారం వెల్లడించింది.

Updated : 03 Jan 2024 12:06 IST

దిల్లీ: ఇటలీకి చెందిన విలాస బైక్‌ల తయారీ సంస్థ డుకాటి, ఈ ఏడాది మన దేశంలో 8 కొత్త మోడళ్లను విడుదల చేస్తామని మంగళవారం వెల్లడించింది. మల్టీస్ట్రాడా వీ4 ఆర్‌ఎస్‌, డెసర్ట్‌ఎక్స్‌ ర్యాలీ, పానిగాలే వీ4 రేసింగ్‌ రెప్లికా 2023, డయావెల్‌ ఫర్‌ బెన్‌ట్లే, మాన్‌స్టర్‌ 30 డిగ్రీ యానివర్సరియో, పానిగాలే వీ4 ఎస్‌పీ2 30 డిగ్రీ యానివర్సరియో 916, న్యూ స్ట్రీట్‌ఫైటర్‌ వీ4ఎస్‌ 2023 మోడళ్లను ఈ ఏడాది మన దేశంలోకి తీసుకురాబోతోంది. అంతర్జాతీయంగా ఈ మోడళ్లను గత ఏడాదే డుకాటి ఆవిష్కరించింది. 2024 తొలి త్రైమాసికంలో స్ట్రీట్‌ఫైటర్‌ వీ4 లంబోర్గినితో దేశీయంగా కొత్త మోడళ్ల విడుదల మొదలవుతుందని  డుకాటి ఇండియా ఎండీ బిపుల్‌ చంద్ర వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని