మెర్సిడెస్‌ బెంజ్‌ కొత్త కారు

జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌, సరికొత్తగా జీఎల్‌ఎస్‌ లగ్జరీ ఎస్‌యూవీని పెట్రోల్‌ (రూ.1.32 కోట్లు), డీజిల్‌ (రూ.1.37 కోట్లు) వెర్షన్లలో ఆవిష్కరించింది.

Updated : 09 Jan 2024 06:58 IST

ఈ ఏడాదిలో 12కు పైగా కొత్త మోడళ్లు

దిల్లీ: జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌, సరికొత్తగా జీఎల్‌ఎస్‌ లగ్జరీ ఎస్‌యూవీని పెట్రోల్‌ (రూ.1.32 కోట్లు), డీజిల్‌ (రూ.1.37 కోట్లు) వెర్షన్లలో ఆవిష్కరించింది. ఈ ఏడాది భారత్‌లో రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటు, 12కు పైగా కొత్త కార్లను విపణిలో ప్రవేశపెట్టబోతున్నట్లు మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ వెల్లడించారు. ఇందులో 3 విద్యుత్‌ వాహనాలుంటాయని తెలిపారు. తాము విక్రయిస్తున్న వాహనాల్లో సగానికి పైగా, రూ.1.5 కోట్ల కంటే విలువైన టాప్‌-ఎండ్‌  మోడళ్లే ఉంటున్నాయని తెలిపారు. 2022తో పోలిస్తే 2023లో కంపెనీ 10 శాతం వృద్ధి సాధించి, 17,408 వాహనాలతో రికార్డు విక్రయాలను నమోదు చేసిందన్నారు. 2024 విక్రయాల్లో రెండంకెల వృద్ధి సాధిస్తామని సంతోష్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ వద్ద 3,000 వాహనాలకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని