భిన్నమైన షేర్లలో...

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఇటీవలి కాలంలో మల్టీ క్యాప్‌ ఫండ్లను అధికంగా ఆవిష్కరిస్తున్నాయి. కేవలం ఒక తరగతికి చెందిన ఈక్విటీ షేర్లలోనే కాకుండా చిన్న, మధ్య, పెద్ద కంపెనీల షేర్లు.. అనే తారతమ్యాలు లేకుండా వృద్ధి అవకాశాలు అధికంగా ఉండే చోట పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

Published : 20 Jan 2023 00:48 IST

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఇటీవలి కాలంలో మల్టీ క్యాప్‌ ఫండ్లను అధికంగా ఆవిష్కరిస్తున్నాయి. కేవలం ఒక తరగతికి చెందిన ఈక్విటీ షేర్లలోనే కాకుండా చిన్న, మధ్య, పెద్ద కంపెనీల షేర్లు.. అనే తారతమ్యాలు లేకుండా వృద్ధి అవకాశాలు అధికంగా ఉండే చోట పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీనికి మల్టీ క్యాప్‌ ఫండ్ల మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. తద్వారా తక్కువ నష్టభయంతో అధిక ప్రతిఫలాన్ని సాధించాలని ఆలోచిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే టాటా మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక మల్టీ క్యాప్‌ ఫండ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘టాటా మల్టీ క్యాప్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 30. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ‘నిఫ్టీ 500 మల్టీక్యాప్‌ 50: 25: 25 టీఆర్‌ఐ ఇండెక్స్‌’ తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. టాటా మల్టీ క్యాప్‌ ఫండ్‌కు రాహుల్‌ సింగ్‌, తేజస్‌ గుట్కా, మూర్తి నాగరాజన్‌, అర్వింద్‌ కుమార్‌ చెట్టి ఫండ్‌ మేనేజర్లు. ఈ ఫండ్‌ కింద సమీకరించిన నిధుల్లో 50 శాతాన్ని లార్జ్‌ క్యాప్‌ తరగతికి చెందిన షేర్లకు కేటాయిస్తారు. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లకు 25 శాతం చొప్పున కేటాయించాల్సి ఉంటుంది. కనీసం 3 నుంచి 5 ఏళ్ల కాలానికి పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్న మదుపరులకు ఇటువంటి పథకాలు అనువుగా ఉంటాయి.

స్థిరమైన ఆదాయం కోసం..

వడ్డీ రేట్లు కొంత ఆసక్తికరంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పథకాలను తీసుకొస్తున్నాయి. దీనికి అనుగుణంగా యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ‘యూటీఐ ఫిక్స్‌డ్‌ టెర్మ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌ - సిరీస్‌ 34-3 (1176 రోజులు)’ అనే ఒక పథకాన్ని ఆవిష్కరించింది. ఇది ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ తరగతికి చెందిన క్లోజ్‌ ఎండెడ్‌ పథకం. దీని పేరులోనే ఉన్నట్లుగా 1176 రోజుల తర్వాత అంటే, 2026 ఏప్రిల్‌ 15న ఈ పథకం గడువు తీరిపోతుంది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 24. కనీస పెట్టుబడి రూ.5,000. ‘క్రిసిల్‌ మీడియమ్‌ టెర్మ్‌ డెట్‌ ఇండెక్స్‌’ తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. దీనికి ఫండ్‌ మేనేజర్‌గా సునీల్‌ పాటిల్‌. ఎక్కువ రిస్కు భరించలేని వారు, నాణ్యమైన రుణ పత్రాల్లో  పెట్టుబడులు పెట్టి స్థిరమైన వడ్డీ ఆదాయాన్ని సంపాదించాలని అనుకునే మదుపరులకు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పథకాలు (ఎఫ్‌ఎంపీ) అనుకూలంగా ఉంటాయి.

పొదుపు.. బీమా రక్ష

పరిమిత కాలంపాటు ప్రీమియం చెల్లించే పొదుపు, బీమా అవసరాలకు ఉపయోగపడే ఎండోమెంట్‌ పాలసీని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఆవిష్కరించింది. జీవన్‌ ఆజాద్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ పాలసీని ఆన్‌లైన్‌లోనూ, ఏజెంట్ల ద్వారా తీసుకోవచ్చు. రూ.3లక్షల వరకూ ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. కనీసం రూ.2లక్షలు, గరిష్ఠంగా రూ.5లక్షల వరకూ పాలసీ తీసుకోవచ్చు. 90 రోజుల వయసు నుంచి 50 ఏళ్ల వయసు వారి వరకూ పాలసీని తీసుకోవచ్చు. 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వ్యవధికి దీన్ని ఎంచుకోవచ్చు. పాలసీ వ్యవధికన్నా ఎనిమిదేళ్లు తక్కువగా ప్రీమియం చెల్లించేందుకు వీలుంది. గడువు తీరిన తర్వాత పాలసీ మొత్తాన్ని చెల్లిస్తుంది. పాలసీదారుడు మరణిస్తే.. పాలసీ విలువ, ప్రీమియానికి ఏడు రెట్లు ఏది అధికంగా ఉంటే దాన్ని పరిహారంగా చెల్లిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని