నెలకోసారి వడ్డీ వచ్చేలా...
నా వయసు 33. ప్రైవేటు ఉద్యోగిని. నాలుగేళ్ల మా అమ్మాయి భవిష్యత్ అవసరాల కోసం నెలకు రూ.10వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచిస్తున్నాను.
*నా వయసు 33. ప్రైవేటు ఉద్యోగిని. నాలుగేళ్ల మా అమ్మాయి భవిష్యత్ అవసరాల కోసం నెలకు రూ.10వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?
సుభాశ్
ముందుగా మీ పాప భవిష్యత్ అవసరాలకు తగిన ఆర్థిక రక్షణ కల్పించండి. ఇందుకోసం మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా జీవిత బీమా పాలసీ తీసుకోండి. మీరు పెట్టే పెట్టుబడి విద్యా ద్రవ్యోల్బణానికి మించి రాబడిని ఆర్జించేలా చూసుకోవాలి. రూ.10వేలలో రూ.6వేలను క్రమానుగత పెట్టుబడి విధానంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లకు కేటాయించండి. మిగతా రూ.4వేలను సుకన్య సమృద్ధి స్కీంలో మదుపు చేయండి. ఇలా 14 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే.. సగటున 11 శాతం రాబడితో రూ.36,11,390 అయ్యేందుకు అవకాశం ఉంది.
* ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నా వయసు 21. మరో అయిదేళ్ల వరకూ నెలకు రూ.15వేలు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను.. దీనికోసం షేర్లను పరిశీలించవచ్చా?
రాము
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే సరైన అవగాహన ఉండాలి. దీర్ఘకాలం మదుపు చేసినప్పుడు మంచి లాభాలకు అవకాశం ఉంటుంది. అయిదేళ్ల సమయం ఉంది కాబట్టి మంచి షేర్లను ఎంచుకొని, పెట్టుబడులు ప్రారంభించవచ్చు. వీటిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రత్యామ్నాయంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నెలనెలా మదుపు చేసే ప్రయత్నం చేయొచ్చు.దీనివల్ల మీకు నష్టభయం తగ్గుతుంది. మీ సమయమూ ఆదా అవుతుంది. వీటిని ఏడాదికోసారి సమీక్షించుకోవాలి.
* మా తల్లిదండ్రుల పేరు మీద రూ.10 లక్షలు ఒకేసారి జమ చేసి, నెలనెలా వడ్డీ వారి ఖాతాలో జమయ్యేలా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనికోసం ఏం చేయాలి?
లక్ష్మి
మీ తల్లిదండ్రుల వయసు 60 ఏళ్లపైన ఉంటే.. పోస్టాఫీసులో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంను పరిశీలించవచ్చు. ఇందులో 8 శాతం రాబడి వస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. మూడు నెలలకు రూ.20వేల వరకూ వడ్డీ వస్తుంది. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లూ పెరిగాయి. నాన్‌క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకొని, నెలనెలా వడ్డీని పొందే అవకాశం ఉంది.
* బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్లలోని డివిడెండ్ ఆప్షన్‌లో రూ.5లక్షలను ఒకేసారి జమ చేయాలని అనుకుంటున్నాను. నెలనెలా రాబడి వచ్చేలా చూసుకోవాలా? లేదా డివిడెండ్‌ను తిరిగి పెట్టుబడి పెట్టడం మంచిదా?
శ్రీకృష్ణ
బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్లలో డివిడెండ్ ఆప్షన్‌కు ప్రత్యామ్నాయంగా సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. మీకు కావాల్సినంత మొత్తం నెలనెలా వచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు ఆదాయం అవసరం లేదు అనుకుంటే.. డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్ కన్నా గ్రోత్ ఆప్షన్ ఎంచుకోవడమే మేలు.
* చిరు వ్యాపారిని. 15 రోజులకోసారి రూ.3వేల వరకూ పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఇందుకు అవకాశం ఉంటుందా? కనీసం 10 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం వస్తుంది?
సుధాకర్
మీరు 15 రోజులకోసారి మదుపు చేసేందుకూ వీలుంది. మూడు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకొని, మీకు అనుకూలమైన తేదీల్లో పెట్టుబడి పెట్టేలా ఏర్పాటు చేసుకోండి. ఇలా 10 ఏళ్లపాటు మదుపు చేస్తే 13 శాతం సగటు రాబడితో రూ.13,26,220 అయ్యేందుకు అవకాశం ఉంది.
తుమ్మ బాల్‌రాజ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train accident: మార్చురీల వద్దే భారీగా ‘గుర్తుపట్టని’ మృతదేహాలు.. భద్రపరచడం పెద్ద సవాలే!
-
Politics News
Anam: వైకాపా దుర్మార్గపు పాలనను అంతమొందించాలి: ఆనం రామనారాయణరెడ్డి
-
Sports News
Pat Cummins: అంతర్జాతీయ క్రికెట్ గుత్తాధిపత్యానికి ఐపీఎల్ ముగింపు పలికింది : ఆసీస్ కెప్టెన్
-
General News
Weather Report: తెలంగాణలో రాగల 3రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ