నెలకు రూ.20వేలు మదుపు చేస్తే
నెలకు రూ.20 వేల వరకూ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను.
నెలకు రూ.20 వేల వరకూ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం ఆశించవచ్చు? 14-15 శాతం వరకూ రాబడి అందుకోవచ్చా?
నరేందర్
పెట్టుబడిని 15 ఏళ్లపాటు కొనసాగిస్తానంటున్నారు. కాబట్టి, మంచి మొత్తం జమ అవుతుంది. పెట్టుబడి వృద్ధికీ అవకాశం ఉంటుంది. గతంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు 15 శాతం, అంతకన్నా ఎక్కువగా రాబడినిచ్చిన సందర్భాలున్నాయి. కానీ, భవిష్యత్తులో 14-15 శాతం వరకూ రాబడి అందే అవకాశాలు కాస్త తక్కువే అని చెప్పాలి. 12-13 శాతం వరకూ రాబడిని అంచనా వేసుకోవచ్చు. మీరు నెలకు రూ.20వేల చొప్పున 15 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మదుపు చేస్తే.. 12 శాతం రాబడి అంచనాతో.. రూ.89,47,130 అయ్యేందుకు అవకాశం ఉంది. మంచి వైవిధ్యం ఉన్న పథకాలతో పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోండి. క్రమం తప్పకుండా మీ పెట్టుబడులను సమీక్షించుకోండి. మీకు డబ్బు అవసరమైన మూడేళ్ల ముందు నుంచే క్రమంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల నుంచి పెట్టుబడిని బయటకు తీసి, సురక్షిత పథకాలకు మళ్లించాలి.
మా దగ్గర రూ.5 లక్షలు ఉన్నాయి. 13 ఏళ్ల మా పాప భవిష్యత్ అవసరాల కోసం వీటిని ఏదైనా మంచి రాబడినిచ్చే పథకంలో మదుపు చేయాలని అనుకుంటున్నాం. దీనికోసం ఏం చేయాలి?
రఘు
ముందుగా మీ పాప భవిష్యత్ అవసరాలను కాపాడేందుకు మీ పేరుపైన టర్మ్ పాలసీ ద్వారా తగినంత జీవిత బీమా పాలసీ తీసుకోండి. ఎక్కడ మదుపు చేసినా విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి వచ్చేలా చూసుకోవాలి. పెట్టుబడి కోసం హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లు, బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్లలో మదుపు చేయొచ్చు. రూ.5లక్షలను పెట్టుబడి పెట్టి, 8 ఏళ్లపాటు కొనసాగిస్తే 10 శాతం రాబడి అంచనాతో రూ.10,71,795 అయ్యేందుకు అవకాశం ఉంది.
మా అబ్బాయికి 12 ఏళ్లు. తనకు ఉపయోగపడేలా నెలకు రూ.6,000 మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. దీనితోపాటు ఏడాదికి మరో 10 శాతం చొప్పున పెట్టుబడి పెంచాలనేది ఆలోచన. ఎనిమిదేళ్లపాటు మదుపు చేయడానికి ఏ పథకాలను ఎంచుకోవాలి?
సురేశ్
మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.6,000 డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయండి. పెట్టుబడిని ఏటా 10 శాతం పెంచడం మంచి ఆలోచనే. దీనివల్ల అధిక మొత్తం జమయ్యేందుకు వీలవుతుంది. ఇలా మీరు 8 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 12 శాతం రాబడి అంచనాతో రూ.13,40,130 అయ్యేందుకు వీలుంది.
దీర్ఘకాలిక అవసరాలు, ఆదాయపు పన్ను మినహాయింపు కోసం నెలకు రూ.10 వేలు మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ నేపథ్యంలో నా ప్రణాళిక ఎలా ఉండాలి?
శ్రీనివాస్
ఆదాయపు పన్ను మినహాయింపు పొందడం కోసం సెక్షన్ 80సీలో భాగంగా ఉన్న పలు పథకాల్లో రూ.1,50,000 వరకూ మదుపు చేయొచ్చు. ఇందులో దీర్ఘకాలంపాటు కొనసాగే పెట్టుబడి పథకాలూ ఉన్నాయి. కాబట్టి, తక్కువ లాకిన్ వ్యవధి ఉండే వాటిని చూసుకోవాలి. ఇందుకు మీరు ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్) పరిశీలించవచ్చు. ఇందులో మూడేళ్లపాటు మాత్రమే లాకిన్ వ్యవధి ఉంటుంది. ఇవి ఈక్విటీ పథకాలు కాబట్టి, స్వల్ప కాలంలో కాస్త నష్టభయం ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలం అంటున్నారు కాబట్టి, మీకు వీలైనంత వ్యవధి వరకూ పెట్టుబడి కొనసాగించడం ద్వారా మంచి లాభాలను అందుకునేందుకు అవకాశం ఉంటుంది.
తుమ్మ బాల్‌రాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడిలో మదుపు ఎలా?
మా అమ్మాయి కోసం బంగారం జమ చేయాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.20వేల వరకూ పెట్టుబడి పెట్టగలం. ఏం చేయాలి? -
పెట్టుబడుల వివరాలు తెలుస్తాయా?
మా అమ్మాయి వయసు 4. తన పేరుమీద వీలైనప్పుడల్లా కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. మరో 20 ఏళ్ల తర్వాత ఈ డబ్బుతో అవసరం అవుతుంది. -
టాపప్ రుణంతో మదుపు చేయొచ్చా?
నా వయసు 34. ఇప్పటి వరకూ ఎలాంటి పాలసీలూ లేవు. నెలకు రూ.5,000 వరకూ రికరింగ్ డిపాజిట్ చేస్తున్నాను. -
నెలకు రూ.20వేలు రావాలంటే..
జాతీయ పింఛను పథకంలో నెలకు రూ.10,000 జమ చేయాలని అనుకుంటున్నాను. -
Share Market: షేర్లలో మదుపు చేస్తే లాభమేనా?
మా అమ్మాయి వయసు ఆరేళ్లు. తన భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా నెలకు రూ.10,000 వరకూ మదుపు చేద్దామని ఆలోచన. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
Q&A: 15 ఏళ్లలో ₹కోటి సమకూర్చుకోవడం ఎలా?
నాకు 14 ఏళ్ల బాబు ఉన్నాడు. భర్త ఇటీవలే ప్రమాదంలో చనిపోయారు. జీవిత బీమా పాలసీ నుంచి రూ.4 లక్షల వరకూ వచ్చాయి. -
నెలనెలా వడ్డీ వచ్చేలా..
నా వయసు 37. ప్రైవేటు ఉద్యోగిని. ఎనిమిదేళ్ల మా అమ్మాయి భవిష్యత్ అవసరాల కోసం నెలకు రూ.12 వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
పన్ను ఆదాకు యులిప్ తీసుకోవచ్చా?
ఆదాయపు పన్ను మినహాయింపు కోసం రూ.60 వేల వరకూ మదుపు చేయాల్సి వస్తోంది. జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) ఎంచుకుంటే బాగుంటుందని అంటున్నారు. -
బంగారం ఫండ్లలో మదుపు చేయొచ్చా?
మీ వార్షికాదాయానికి 12 రెట్ల వరకూ బీమా రక్షణ ఉండేలా చూసుకోండి. అంటే, మీకు దాదాపు రూ.60 లక్షల వరకూ బీమా అవసరం. ఈ మొత్తాన్ని ఒకే బీమా సంస్థ నుంచి కాకుండా, మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు బీమా సంస్థలను ఎంచుకొని, రూ.30 లక్షల చొప్పున టర్మ్ పాలసీలను తీసుకోండి -
తీవ్ర వ్యాధులకు పాలసీ తీసుకుంటే..
నా వయసు 57. మరో మూడేళ్లలో పదవీ విరమణ చేస్తాను. ప్రస్తుతం నెలకు రూ.35,000 గృహరుణం ఈఎంఐ చెల్లిస్తున్నాను. ఇంకా 6 ఏళ్లపాటు చెల్లించాలి. -
ప్రత్యేకంగా పాలసీ తీసుకోవాలా?
చేయాలనే ఆలోచన ఉంది. నెలకు రూ.8వేల వరకూ పెట్టుబడి పెట్టగలను. నా ప్రణాళిక ఎలా ఉండాలి? -
నెలనెలా ఆదాయం రావాలంటే...
నెలనెలా వడ్డీ అందేలా మా అమ్మ పేరుమీద రూ.12 లక్షలు జమ చేయాలనుకుంటున్నాం. ఆమె వయసు 54. డెట్ ఫండ్లలో మదుపు చేయొచ్చా? -
మదుపు... పసిడిలో 15 శాతమే
రెండు మూడేళ్ల వ్యవధికి డబ్బును జమ చేయాలనుకుంటే.. ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఎఫ్డీలో వడ్డీ రేట్లు సానుకూలంగానే ఉన్నాయి -
నెలకు రూ.10వేలు మదుపు చేస్తే...
మా అబ్బాయి పేరుమీద నెలకు రూ.25 వేల వరకూ వరకూ మదుపు చేద్దామని అనుకుంటున్నా. కనీసం 10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు అనువైన పథకాలేమున్నాయి? ఎంత మొత్తం జమయ్యే అవకాశం ఉంది? -
14 శాతం రాబడి సాధ్యమేనా?
రాబడి ఎక్కువగా రావాలంటే.. అధిక నష్టభయానికీ సిద్ధంగా ఉండాలి. ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లో మంచి రాబడి వస్తుంది. అదే సమయంలో కొంత నష్టభయమూ ఉంటుంది. -
నెలకు రూ.30 వేలు వచ్చేలా
మరో రెండేళ్లలో పదవీ విరమణ చేయబోతున్నాను. అప్పటి నుంచి నాకు నెలకు రూ.30 వేల వరకూ ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. -
విద్యా ద్రవ్యోల్బణం అధిగమించేలా...
ముందుగా మీపై ఆధారపడిన వారుంటే.. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీని తీసుకోండి. ఇందుకోసం తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్ పాలసీని పరిశీలించండి. -
ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవచ్చా?
నెలకు రూ.25 వేల వరకూ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలన్నది ఆలోచన. కనీసం ఎనిమిదేళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. అధిక రాబడి వచ్చేలా ఎలాంటి పథకాలు ఎంపిక చేసుకోవాలి? -
గృహరుణం మార్చుకోవచ్చా?
నా వయసు 23. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.28 వేల వరకూ వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.7 వేలను పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. నా ప్రణాళిక ఎలా ఉండాలి? -
పెట్టుబడిగా బంగారం మంచిదేనా?
బంగారం ధర పెరుగుతూ ఉంది కదా.. నెలకు రూ.10వేల వరకూ ఇందులో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం 10 ఏళ్లపాటు మదుపు చేస్తాను.