Stock Market: సానుకూలంగా మార్కెట్‌ సూచీలు..!

దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. 

Published : 07 Aug 2023 09:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశయ మార్కెట్లు సోమవారం సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 143 పాయింట్లు లాభపడి 65,864 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 19,558 వద్ద కొనసాగుతున్నాయి. జెన్‌ టెక్నాలజీస్‌, మోర్ఫెన్‌ ల్యాబ్స్‌, వన్‌ 97 కమ్యూనికేషన్స్‌, సానోఫీ ఇండియా, అధామ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. అదానీ ఎనర్జీ, గుజరాత్‌ అంబుజా ఎక్స్‌పోర్ట్స్‌, డయాక్సిన్స్‌ టెక్నాలజీస్‌, ఎంవోఐఎల్‌ షేర్లు కుంగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు బలపడి 82.73 వద్ద నేడు ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో అమెరికా మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో తైవాన్‌ మినహా ప్రధాన సూచీలు కూడా నష్టాల్లోనే ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. షాంఘై కాంపోజిట్‌ సూచీ 0.60, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.32, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌ సెంగ్‌ 0.26, జపాన్‌కు చెందిన నిక్కీ సూచీ 0.01శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

నేటి బోర్డు సమావేశాలు: గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, కిమ్స్‌, మెడ్‌ప్లస్‌, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌, టొరెంట్‌ ఫార్మా, గ్లాండ్‌ ఫార్మా, ఇండియా సిమెంట్స్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌, పీబీ ఫిన్‌టెక్‌, టాటా కెమికల్స్‌, ది రామ్‌కో సిమెంట్స్‌, బేయర్‌ క్రాప్‌సైన్స్‌, ఇమామీ, వర్ల్‌పూల్‌, సన్‌ఫార్మా అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌, ఇండిగో పెయింట్స్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని