WhatsApp Channels: ఇక వాట్సప్‌లో సినిమా, క్రికెట్‌ అప్‌డేట్స్‌.. ఛానెల్స్‌ ఎలా వాడాలంటే?

How to use WhatsApp Channels: వాట్సప్‌ ఛానెల్స్‌ సదుపాయం చాలా మందికి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని క్షణాల్లో పొందొచ్చు.

Updated : 21 Sep 2023 13:06 IST

WhatsApp Channels | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (Whatsapp) కొత్తగా ఛానెల్స్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. భారత్‌ సహా 150 దేశాల్లో ఫీచర్‌ను ప్రారంభించినట్లు మెటా తెలిపింది. ఇప్పటికే చాలా మందికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగిలిన వారికీ రానుంది. ఒకవేళ వాట్సప్‌ అప్‌డేట్‌ చేసుకోకపోయి ఉంటే లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ అవ్వండి.

వాట్సాప్‌ ఛానెల్‌ అంటే?

ఇన్నాళ్లూ వాట్సప్‌ను పరస్పర కమ్యూనికేషన్‌ కోసం మాత్రమే వాడేవాళ్లం. ఆ తర్వాత గ్రూప్స్‌ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఛానెల్స్‌. ఈ ఫీచర్‌ ద్వారా మీకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను ఫాలో అయ్యి వాట్సాప్‌లోనే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు. అచ్చం ట్విటర్‌, ఇన్‌స్టాలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతున్నామో అలా అన్నమాట. కావాలనుకుంటే ఈ అప్‌డేట్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. మీరు ఫాలో అయినంత మాత్రానా మీ ఫోన్‌ నంబర్‌ ఎవరికీ కనిపించదు.

ఎలా ఫాలో అవ్వాలి..?

వాట్సప్‌లో మీకు ఛానెల్స్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చి ఉంటే స్టేటస్‌ (Status) ట్యాబ్‌ స్థానంలో అప్‌డేట్స్‌ (Updates) అని కనిపిస్తుంది. అక్కడ పై భాగంలో స్టేటస్‌లు కనిపిస్తాయి. దిగువన ఛానెల్స్‌ కనిపిస్తాయి. దిగువన మీకు ఫైండ్‌ ఛానెల్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇప్పటికే కత్రినా కైఫ్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు పలు మీడియా సంస్థల ఛానెళ్లు మీకు కనిపిస్తాయి. పక్కనే ఉన్న ప్లస్‌ (+) సింబల్‌ క్లిక్‌ చేయడం ద్వారా ఛానెల్‌ను ఫాలో అవ్వొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మంగళవారం వాట్సాప్‌ ఛానల్‌లో చేరారు. కొన్నిగంటల్లోనే దాదాపు రెండున్నర లక్షల మంది ఆయన్ను అనుసరించడం విశేషం.

మీరూ క్రియేట్‌ చేయొచ్చు..

ఛానెల్స్‌ ఆప్షన్‌ ద్వారా వ్యక్తులు సైతం తమ సొంత ఛానెల్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఛానెల్స్‌ పక్కనే ఉన్న ప్లస్‌ సింబల్‌ క్లిక్‌ చేస్తే క్రియేట్‌ ఛానెల్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. తర్వాత డీపీ, ఛానెల్‌ పేరు, ఛానెల్‌ డిస్క్రిప్షన్‌ పేర్కొని సింపుల్‌గా ఛానెల్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వారికి ఆ లింక్‌ను షేర్‌ చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు