LIC Policy: ఎల్‌ఐసీ పాలసీ డాక్యుమెంట్ పోయిందా? ఏం చేయాలి?
Lic Duplicate bond: ఎల్‌ఐసీ పాలసీని భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఏదైనా కారణం చేత పాలసీ డాక్యుమెంట్ పోతే? అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి?
ఇంటర్నెట్ డెస్క్: భారత జీవిత బీమా సంస్థ (LIC) నుంచి ఏదైనా పాలసీ (LIC Policy) తీసుకున్నప్పుడు మనకు ఒక బాండ్‌ను ఆ సంస్థ జారీ చేస్తుంది. పాలసీ నంబర్, పాలసీదారుడి పేరు, నామినీ సహా పాలసీకి సంబంధించిన అన్ని వివరాలూ అందులో ఉంటాయి. మన పాలసీపై ఎప్పుడైనా లోన్ తీసుకోవాల్సి వచ్చినా.. క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేయాలన్నా ఈ డాక్యుమెంట్ కీలకం. కాబట్టి దీన్ని భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఏదైనా కారణంగా పాలసీ డాక్యుమెంట్ పూర్తిగా పోతే? లేదంటే అగ్నిప్రమాదాలు, వరదల కారణంగా పాక్షికంగా మిగిలితే? అందుకు చింతించాల్సిన అవసరం లేదు. పాలసీదారుడికి డూప్లికేట్ బాండ్‌ను (Duplicate bond) ఎల్‌ఐసీ జారీ చేస్తుంది. ఒరిజినల్ డాక్యుమెంట్‌లానే ఇదీ పనిచేస్తుంది. అదెలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
- ఒకవేళ మీ పాలసీ డాక్యుమెంట్ పోతే ఆ విషయాన్ని ముందుగా మీ ఎల్‌ఐసీ ఏజెంట్‌కు తెలియజేయండి. లేదంటే నేరుగా ఎల్‌ఐసీ బ్రాంచ్‌ని సందర్శించండి.
- డూప్లికేట్ బాండ్ కోసం మీరు చేసిన ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన పాత రసీదులను సమర్పించాల్సి ఉంటుంది.
- పాలసీ విలువను బట్టి స్టాంప్ డ్యూటీ చెల్లించి ఇండెమ్నిటీ బాండ్‌ను నోటరీ చేయించాలి.
- ఫొటో ఐడెంటిటీ కింద పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఏదైనా గుర్తింపు కార్డును సమర్పించాల్సి ఉంటుంది.
- రెసిడెన్స్ ప్రూఫ్ కింద టెలిఫోన్ బిల్లు, బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను ఇవ్వాలి.
- బ్రాంచ్ కౌంటర్‌లో పాలసీ ప్రిపరేషన్ ఛార్జీల కింద కొంతమొత్తాన్ని చెల్లిస్తే మీకు డూప్లికేట్ బాండ్‌ను ఎల్‌ఐసీ జారీ చేస్తుంది.
- ఒకవేళ ఏదైనా కారణంతో మీ డాక్యుమెంట్ పాక్షికంగా మిగిలినట్లతే డూప్లికేట్ పాలసీకి దరఖాస్తు చేసేటప్పుడు రుజువుగా చూపించాల్సి రావొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
మాజీ మంత్రి ముత్తంశెట్టికి చుక్కెదురు.. రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన
-
Politics News
Perni Nani: ‘జగన్ పిచ్చి మారాజు’
-
Politics News
Kumaraswamy: దేవేగౌడ తర్వాత నాకు కేసీఆరే స్ఫూర్తి: కుమారస్వామి
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ