Tech Tip: ఎవరు పడితే వారు వాట్సప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేయకూడదంటే?

Tech Tips: మీ అనుమతి లేకుండా వాట్సప్‌ గ్రూపుల్లో మిమ్మల్ని యాడ్‌ చేయడానికి వీలుండదని మీకు తెలుసా..? ఈ ఫీచర్‌ని ఎలా ఎనేబల్ చేసుకోవాలంటే..?

Updated : 13 Nov 2023 11:25 IST

Whatsapp Tech Tip | ఇంటర్నెట్‌డెస్క్‌:  వాట్సాప్‌లో కొందరు మన అనుమతి లేకుండా మనల్ని వేర్వేరు గ్రూపుల్లో యాడ్‌ చేసేస్తుంటారు. కొందరికి ఈ విషయం చాలా ఇబ్బంది కలిగిస్తుంటుంది. కొత్తగా చేరిన గ్రూప్‌లో ఇమడ లేక.. మొహమాటంతో గ్రూప్‌ నుంచి జారుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలా సమస్య తలెత్తకుండా వాట్సప్‌లో ఓ ఫీచర్‌ ఉంది. దాన్ని ఎనేబల్‌ చేసుకుంటే చాలు.. మీ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త గ్రూప్‌ల్లో యాడ్‌ చేయడానికి వీల్లేదు. ఈ ఫీచర్‌ ఎలా ఎనేబుల్‌ చేయాలో చూద్దాం..

  • వాట్సప్‌లోని పైన కుడివైపున కనిపించే మూడు చుక్కలపై క్లిక్‌ చేయండి.
  • ‘Settings’ లోకి వెళ్లి ‘Privacy’ ఆప్షన్‌ ఎంచుకోవాలి.
  • కిందికి స్క్రోల్‌ చేస్తూ వెళ్లి ‘Groups’ ఆప్షన్‌ను ట్యాప్‌ చేయాలి.
  • అందులో ఎవ్రీవన్‌, మై కాంటాక్ట్స్‌, మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • వాటిల్లో ఎవ్రీవన్‌ కాకుండా మిగతా ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 
  •  ఇకపై ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్‌ చేయడానికి ప్రయత్నిస్తే మీకు ఇన్వైట్ లింక్‌ వస్తుంది.
  • ఆ లింక్‌ను క్లిక్‌ చేసి గ్రూప్‌లో యాడ్‌ అవ్వొచ్చు.

గమనిక: వాట్సాప్‌లో వచ్చే లింక్స్, వెబ్‌ లింక్స్‌ను క్లిక్ చేసే ముందు తప్పనిసరిగా ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవడం ఉత్తమం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని