Tax Calculator: ఐటీ పోర్టల్‌లో ట్యాక్స్ కాలిక్యులేటర్.. ఎలా వాడాలి?
పన్ను చెల్లింపుదారులకు సహాయపడేందుకు ఆదాయపు పన్ను విభాగం తన పోర్టల్‌లో పన్ను కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆదాయపు పన్ను (Income tax) ఎంత చెల్లించాలో తెలియట్లేదా? పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది ఎంచుకుంటే లాభం చేకూరుతుందో లెక్కలు వేయడంలో గందరగోళానికి లోనవుతున్నారా? అయితే ఇక చింతించాల్సిన పనిలేదు. పన్ను చెల్లింపుదారులకు సహాయపడేందుకు ఆదాయపు పన్ను విభాగం తన పోర్టల్‌లో పన్నుకాలిక్యులేటర్ను (Calculator) అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీకు ఏ విధానంలో ఎంత పన్ను వర్తిస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. అయితే, ఈ కాలిక్యుటర్ ఎక్కడ ఉంది? ఎలా ఉపయోగించాలి? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది?
- పన్ను కాలిక్యులేటర్ కోసం ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- ‘క్విక్ లింక్స్’లో ‘ఇన్కమ్ ట్యాక్స్ కాలిక్యులేటర్’ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. లేదా ఇక్కడ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా కూడా నేరుగా కాలిక్యులేటర్ పేజీకి వెళ్లొచ్చు.
- ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి: 1. బేసిక్ కాలిక్యులేటర్, 2. అడ్వాన్స్డ్ కాలిక్యులేటర్. ఈ రెండింటి ద్వారా పన్ను ఎంత వర్తిస్తుందో తెలుసుకోవచ్చు.
బేసిక్ కాలిక్యులేటర్..
మీరు మదింపు సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్), పన్ను చెల్లింపుదారుని కేటగిరీ (వ్యక్తిగత, హెచ్‌యూఎఫ్, ఎల్ఎల్పి వంటివి), పన్ను చెల్లింపుదారుని వయసు (60 ఏళ్ల లోపు, సీనియర్ సిటిజన్, సూపర్ సీనియర్ సిటిజన్), నివాస స్థితి వంటి వాటిని ఎంచుకుని.. మీ వార్షిక ఆదాయం, మొత్తం మినహాయింపులు తెలియజేస్తే, మీకు పాత, కొత్త పన్ను విధానాల్లో ఎంత పన్ను పడుతుందో నేరుగా తెలియజేస్తుంది. అలాగే, ఏ విధానం ప్రయోజనకరమో కూడా తెలియజేస్తుంది. అయితే, ఇది త్వరితగతిన సులభంగా బేసిక్ సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
అడ్వాన్స్డ్ కాలిక్యులేటర్..
- చెల్లించాల్సిన పన్నును మరింత విపులంగా లెక్కించేందుకు అడ్వాన్స్డ్ కాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది.
- ఈ విధానంలో ముందుగా మీరు పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది ఎంచుకుంటున్నారో తెలియజేయాలి.
- ఆ తర్వాత మదింపు సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్), పన్ను చెల్లింపుదారుని కేటగిరి (వ్యక్తిగత, హెచ్‌యూఎఫ్, ఎల్ఎల్పి వంటివి), పన్ను చెల్లింపుదారుని వయసు (60 ఏళ్ల లోపు, సీనియర్ సిటిజన్, సూపర్ సీనియర్ సిటిజన్), నివాస స్థితి వంటి వాటిని ఎంచుకోవాలి. ఒకవేళ మీరు 30 ఏళ్ల వయసున్న, జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగి అయితే పన్ను చెల్లింపుదారుని కేటగిరీలో ఇండివిడ్యువల్, వయసు 60 ఏళ్ల లోపు వంటి ఆప్షన్లను ఎంచుకోవాలి.
- అలాగే, కింద అడిగిన వివరాలను ఇవ్వాలి. ముందుగా మీకు జీతం ద్వారా వచ్చే ఆదాయం ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఇంటి ద్వారా ఆదాయం, మూలధన ఆదాయం, ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే ఆయా కేటగిరీలో ‘ప్రొవైడ్ ఇనకమ్ డీటెయిల్స్’ పై క్లిక్ చేసి పూర్తి సమాచారం ఇవ్వాలి.
- ఇక ఆ తర్వాత మీరు చేసిన పన్ను ఆదా పెట్టుబడులు, ఇతర మినహాయింపులకు సంబంధించిన వివరాలు ‘డిడక్షన్’ కింద కనిపిస్తున్న ‘ప్రొవైడ్ ఇన్కమ్ డీటెయిల్స్’ పై క్లిక్ చేసి ఇవ్వాలి.
- కొత్త పన్ను విధానంలో డిడక్షన్లు వర్తించవు కాబట్టి సంబంధిత మొత్తాన్ని ఎంటర్ చేసే అవకాశం ఉండదు. పాత పన్ను విధానంలో మాత్రం కొన్ని సెక్షన్ల కింద మినహాయింపులు కనిపిస్తాయి. వాటిని నేరుగా ఎంటర్ చేయవచ్చు.
- ఇవి కాకుండా మీకు ఇంకా మినహాయింపులు ఉంటే, కింద ‘ఎంటర్ డిడక్షన్’, ‘యాడ్ డిడక్షన్’ అని కనిపిస్తాయి. అక్కడ డిడక్షన్ వివరాలు ఎంటర్ చేసి వర్తించే పన్నును లెక్కించవచ్చు.
చివరిగా..
పన్ను చెల్లింపుదారులు.. వారి వారి ఆదాయం, మినహాయింపుల వంటి సమాచారం అందించి ఆదాయపు పన్ను విభాగం అందించే కాలిక్యులేటర్ ద్వారా స్వయంగా పన్ను లెక్కించవచ్చు. అలాగే, మీకు ఏ విధానం లాభదాయకమైతే ఆ విధానాన్ని ఎంచుకుని రిటర్నులు ఫైల్ చేయవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమాలో నెట్వర్క్ ఆసుపత్రుల ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి ఆరోగ్య బీమా సంస్థ తన పాలసీదారులకు నగదు రహిత చికిత్సనందించడానికి కొన్ని ఆసుపత్రులతో భాగస్వామ్యాన్ని (టై-అప్) కలిగి ఉంటుంది. దీని వల్ల పాలసీదారులకు ప్రయోజనమేంటో ఇక్కడ తెలుసుకుందాం.. -
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది. -
క్రెడిట్ కార్డుల ద్వారా క్యాష్‌బ్యాక్ ఎలా సంపాదించాలి?
క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులు మీరు వస్తువులను కొనుగోలు చేయడానికి మీ కార్డు స్వైప్ చేసినప్పుడు కొంత డబ్బును తిరిగి పొందేందుకు ఉపయోగపడతాయి. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్‌తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’