Yamaha: భారత్‌లోకి యమహా కొత్త బైక్స్‌.. ధర రూ.4లక్షలు పైనే!

Yamaha bikes: యమహా రెండు కొత్త బైకులను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధర రూ.4లక్షల పైమాటే. దిగుమతి చేసి వీటిని దేశీయంగా విక్రయించనున్నారు.

Published : 20 Dec 2023 18:35 IST

చెన్నై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) రెండు కొత్త బైకులను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆర్‌3 (R3), ఎంటీ 03 (MT-03) పేరిట ఈ కొత్త మోడళ్లను తీసుకొచ్చింది. ఆర్‌3 మోటార్‌ సైకిల్‌ ధరను రూ.4.64 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌, దిల్లీ), ఎంటీ-03 ధరను రూ.4.59 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. జపనీస్‌ టెక్నాలజీ ఆధారంగా రూపొందిన ఈ రెండు మోడళ్లను పూర్తిగా దిగుమతి చేసి దేశీయంగా విక్రయించనున్నారు. ఎక్స్‌క్లూజివ్‌గా బ్లూస్క్వేర్‌ డీలర్‌షిప్స్‌ వద్ద ఇవి లభిస్తాయి.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో జమ చేస్తున్నారా? నామినీలను చేర్చేందుకు ఇంకొన్ని రోజులే గడువు!

యమహా గతంలో భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన ఆర్‌15ని ఆర్‌3 పోలి ఉంటుంది. ఇందులో 321 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ట్విన్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 41.4 బీహెచ్‌పీ పవర్‌ను, 29.6 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఇచ్చారు. ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లసర్‌ ఇచ్చారు. బ్లూటూత్‌ కనెక్టివిటీ మాత్రం లేదు. పూర్తి ఎల్‌ఈడీ ల్యాంప్స్‌తో వస్తోంది. ముందువైపు అప్‌-సైడ్‌ డౌన్‌ ఫోర్క్‌, వెనుకవైపు మోనోషాక్‌ సెట్‌అప్‌ను అమర్చారు. ముందూ వెనుక డిస్క్‌ బ్రేకులు ఉన్నాయి. డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌ సదుపాయం ఉంది.

ఇక ఎంటీ-03 ఎంటీ-15ని పోలి ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ ఉంది. ఆర్‌3 తరహాలోనే ఇందులోనూ ముందువైపు అప్‌సైడ్‌ డౌన్‌ ఫోర్క్‌, వెనుకవైపు మోనోషాక్‌ ఇచ్చారు. ఇందులోనూ 321 సీసీ ఇంజిన్‌ అమర్చారు. ఇది 42 హెచ్‌పీ పవర్‌ను, 29.5 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఉంది. మల్టీ ఫంక్షన్‌ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉంది. బ్లూటూత్‌ సదుపాయం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని