stock market : లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు..

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

Published : 25 Jul 2023 09:34 IST

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు(stock market) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 19,700 పాయింట్లపైన నిఫ్టీ ఆరంభమైంది. ఉదయం 9.21 నిమిషాలకు సెన్సెక్స్‌(Sensex) 47 పాయింట్లు లాభపడి 66427 వద్ద, నిఫ్టీ(Nifty) 20 పాయింట్ల పెరిగి 19692 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.72 వద్ద ఉంది.

నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు సానుకూలంగా ట్రేడింగ్‌ను ముగించడంతో.. నేడు ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు మొత్తం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ఈ సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపాయి. 

నిఫ్టీలో టాటా మోటార్స్‌, హీరో మోటో కార్ప్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, మారుతి సుజుకీ, విప్రో షేర్లు నష్టపోతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని