Stock Market : నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ (stock market) సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

Published : 25 Aug 2023 09:34 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 19,300 దిగువన ప్రారంభం కాగా.. సెన్సెక్స్‌ 65,000 మార్క్‌ను కోల్పోయింది. ఉదయం 9.20 నిమిషాలకు సెన్సెక్స్‌(Sensex) 389 పాయింట్లు కోల్పోయి 64,862 వద్ద.. నిఫ్టీ (Nifty) 115 పాయింట్లు క్షీణించి 19,271 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.65 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఎం అండ్‌ ఎం, విప్రో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టపోతుండగా.. ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఓఎన్జీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హీరో మోటో కార్ప్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని