stock market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు..

స్టాక్‌ మార్కెట్లు ఈ వారాన్ని ఫ్లాట్‌గా ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా కదలాడుతున్నాయి.

Published : 24 Jul 2023 09:38 IST

ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు (stock market) ఈ వారాన్ని ఫ్లాట్‌గా ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సోమవారం ఆసియా పసిఫిక్‌ మార్కెట్లు కుడా మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఉదయం 9.20 నిమిషాలకు సెన్సెక్స్‌ (Sensex) 91 పాయింట్లు నష్టపోయి 66,592 వద్ద.. నిఫ్టీ (Nifty) 22 పాయింట్ల నష్టంతో 19722 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.00 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌యూఎల్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐటీసీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఈ నెల 26న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను మరో     0.25% పెంచొచ్చనే అంచనాలున్నాయి. కార్పొరేట్‌ ఫలితాలు, జులై డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు (27వ తేదీ) నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని