Stock Market : నష్టాలతో మొదలైన దేశీయ మార్కెట్‌ సూచీలు..

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని స్వల్ప నష్టాలతో ప్రారంభించాయి.

Published : 31 Jul 2023 09:35 IST

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీ(Stock Market)లు ఈ వారంలో తొలి ట్రేడింగ్‌ సెషన్‌ను నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీంతో సోమవారం ఉదయం 9.24 నిమిషాలకు సెన్సెక్స్‌(Sensex) 129 పాయింట్లు నష్టపోయి 66,031 వద్ద.. నిఫ్టీ(Nifty) 37 పాయింట్ల నష్టంతో 19608 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.22 వద్ద ఉంది.

నిఫ్టీలో హిందాల్కో, పవర్‌ గ్రిడ్‌ కార్ప్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. అపోలో హాస్పిటల్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, దివిస్‌ ల్యాబ్స్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని