Jio TV: జియోటీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌.. సింగిల్‌ ప్లాన్‌పై 14 ఓటీటీలు

Jio TV premium: జియో టీవీ ప్రీమియం పేరిట కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో 14 ఓటీటీలను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం మూడు ప్రీపెయిడ్‌ ప్లాన్లను జియో ప్రవేశపెట్టింది.

Updated : 15 Dec 2023 16:03 IST

Jio TV premium | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio).. జియోటీవీ (JioTV) ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించింది. జియో ప్రీపెయిడ్‌ యూజర్లు 14 ఓటీటీ యాప్స్‌ను వినియోగించుకునేలా సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ తీసుకొచ్చింది. ఇందుకోసం మూడు వేర్వేరు ప్రీపెయిడ్‌ ప్లాన్లను సైతం జియో లాంచ్‌ చేసింది. వేర్వేరు సబ్‌స్క్రిప్షన్లతో పనిలేకుండా ఒకే రీఛార్జిపై వివిధ ఓటీటీ సేవలను పొందేందుకు జియోటీవీ ప్రీమియం ప్లాన్‌ ఉపయోగపడనుంది.

జియోటీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ కోసం 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల కాలవ్యవధిపై మూడు ప్రీపెయిడ్‌ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. వీటి ధరలను రూ.398, రూ.1198, రూ.4,498గా నిర్ణయించింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ ఈ ప్లాన్లలో లభిస్తాయి. జియో సినిమా ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (మొబైల్‌ ఎడిషన్‌), సన్‌ నెక్ట్స్‌ వంటి 14 ఓటీటీ యాప్స్‌ను వీక్షించొచ్చు. ఈ ప్లాన్లు కేవలం జియో యూజర్లకు మాత్రమే.

అధిక పింఛను ఆశావహులకు కాస్త ఊరట

ప్లాన్ల వారీగా వివరాలు చూస్తే.. రూ.398 సబ్‌స్క్రిప్షన్‌ కింద 12 ఓటీటీ యాప్స్‌ లభిస్తాయి. అదే రూ.1198,. రూ.4498 ప్లాన్ల కింద అయితే 14 ఓటీటీ యాప్స్‌ వస్తాయి. వార్షిక ప్లాన్‌ తీసుకోవాలనుకుంటే ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. డిసెంబర్‌ 16 నుంచి ప్లాన్స్‌ కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. జియో మొబైల్‌ నంబర్‌తో జియో టీవీ ప్రీమియం ఓటీటీ కంటెంట్‌ను పొందొచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను మైజియో యాప్‌ ద్వారా యాక్సెస్‌ చేయొచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్‌ను వినియోగించాలంటే నేరుగా జియో నంబర్‌తో లాగిన్‌ అవ్వొచ్చు. మై జియో యాప్‌లో కూపన్‌ సెక్షన్‌లోకి వెళ్లి జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని