Jio free data: జియోకు ఏడేళ్లు.. ఈ ప్లాన్లపై ఉచిత డేటా

Jio: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ఏడు సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కొన్ని ప్రీ పెయిడ్‌ ప్లాన్లపై అదనపు ప్రయోజనాలను ప్రకటించింది.

Published : 05 Sep 2023 17:41 IST

ఇంటర్నెట్‌స్క్‌: ముకేశ్‌ అంబానీకి చెందిన ప్రముఖ టెలికాం సంస్థ జియో (Reliance Jio) ఏడు సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం అందిస్తున్న కొన్ని ప్రీ పెయిడ్‌ (prepaid plans) ప్లాన్లకు అదనపు ప్రయోజనాలను జోడించింది. ఇప్పటికే ఈ ఆఫర్లు జియో యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబరు 30 వరకే ఈ ప్రయోజనాలు పొందొచ్చు.

జియో అందిస్తున్న రూ.299 రీఛార్జితో ఉన్న జియో ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో 28 రోజుల పాటు అపరిమిత వాయిస్‌కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అంటే 28 రోజులకు గానూ 56 జీబీ డేటా వస్తుంది. ఏడో వార్షిక ఆఫర్‌ కింద 7 జీబీ డేటా అదనంగా పొందొచ్చు. అలాగే, 90 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.749 రీఛార్జిపై రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్‌కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. సెప్టెంబరు 30లోగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 14 జీబీ అదనపు డేటా పొందొచ్చు.

బ్రాండ్‌బ్యాండ్‌ ప్లాన్‌తో పాటు టీవీ, ప్రొజెక్టర్‌.. ఎక్సైటల్‌ ఆఫర్‌!

జియో మరో ప్లాన్ రూ.2,999 రీఛార్జితో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్‌కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912 జీబీ డేటా లభిస్తుంది. జియో ఏడేళ్ల వార్షిక ఆఫర్‌లో భాగంగా మూడు 7జీబీ డేటా కూపన్లు ఇస్తున్నారు. అంటే 21 జీబీ అదనపు డేటా లభిస్తుంది. ఈ రీఛార్జిపై డేటాతో పాటు అదనంగా మెక్‌డొనాల్డ్స్‌, రిలయన్స్‌ డిజిటల్‌, యాత్ర, అజియో, నెట్‌మెడ్‌ కూపన్లు పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని