Kia India: 30 వేల కియా కరెన్స్‌ కార్ల రీకాల్‌

కియా ఇండియా 30 వేల కార్లను రీకాల్‌ చేస్తోంది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కోసం వెనక్కి పిలుస్తున్నట్లు తెలిపింది. వినియోగదారులకు వ్యక్తిగతంగానూ సమాచారం ఇస్తామని పేర్కొంది.

Updated : 26 Jun 2023 18:22 IST

దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ కియా ఇండియా (Kia India) భారీ సంఖ్యలో కరెన్స్‌ (Kia Carens) మోడల్‌ కార్లను రీకాల్‌ చేస్తోంది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కోసం 30,297 కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు తెలిపింది. 2022 సెప్టెంబర్‌ నుంచి 2023 ఫిబ్రవరి మధ్య తయారైన యూనిట్లను రీకాల్‌ చేసినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

రీకాల్‌లో భాగంగా క్లస్టర్‌ బూటింగ్‌ ప్రక్రియలో ఏదైనా సమస్య ఉంటే ఉచితంగానే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసి ఇస్తామని కియా తెలిపింది. లేదంటే క్లస్టర్‌ పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉందని తెలిపింది. రీకాల్‌ ప్రక్రియలో భాగంగా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూస్తామని, వినియోగదారులకూ వ్యక్తిగతంగానూ సమాచారం అందిస్తామని తెలిపింది. షెడ్యూల్‌ అపాయింట్‌మెంట్స్‌ కోసం అథరైజ్డ్‌ డీలర్లను వినియోగదారులు సంప్రదించాల్సి ఉంటుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని