Lava: ₹20వేల లోపే కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో లావా కొత్త ఫోన్‌

Lava Blaze Curve 5G: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ లావా 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో లావా కొత్త ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.  దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

Published : 05 Mar 2024 15:16 IST

Lava Blaze Curve 5G | ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా (Lava) కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. లావా బ్లేజ్‌ కర్వ్‌ 5జీ (Lava Blaze Curve 5G) పేరిట మంగళవారం ఆవిష్కరించింది. ఫోన్‌ బ్యాక్‌ ప్యానెల్‌ ఆకర్షణీయమైన గ్లాస్‌ డిజైన్‌తో తీసుకొచ్చింది. 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ చేసిన ఫోన్‌ ధర, ఫీచర్ల వివరాలు చూసేద్దాం.

లావా కొత్త ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.18,999గా పేర్కొంది. ఐరన్ గ్లాస్, విరిడియన్ గ్లాస్ రంగుల్లో లభిస్తుంది. మార్చి 14 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది. లావా ఈ-స్టోర్‌, అమెజాన్‌తో పాటు లావా రిటైల్‌ దుకాణాల ద్వారా కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. 

ప్రపంచ కుబేరుల జాబితా.. మస్క్‌ను దాటేసిన బెజోస్‌

ఇక ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఆండ్రాయిడ్‌ 14తో ఈ ఫోన్‌ వస్తోంది. మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌, ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ పేర్కొంది. 6.67 అంగుళాల  అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటు ఫీచర్లు కలిగివుంది. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7050 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. లావా బ్లేజ్‌ కర్వ్‌ 5జీలో వెనకవైపు 64ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్‌, 2ఎంపీ మ్యాక్రో కెమెరా ఇచ్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 32ఎంపీ కెమెరా అమర్చారు. 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయంతో ఈ ఫోన్‌ను విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని