Mutual Funds: లార్జ్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులు ఎంతెంత?

3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ఇక్కడ ఉన్నాయి.

Published : 06 Oct 2023 16:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  స్టాక్స్‌లో పెట్టుబడి అందరికీ అంత సులభం కాదు. మార్కెట్‌ పరిస్థితులకనుగుణంగా ఎప్పటికప్పడు వివిధ కంపెనీల స్టాక్స్‌పై పరిశోధన. విశ్లేషణ చేస్తుండాలి. అందువల్ల మార్కెట్‌ అనుభవం లేని పెట్టుబడిదారులు మ్యూచువల్‌ ఫండ్లపై పెట్టుబడి పెట్టొచ్చని మార్కెట్‌ నిపుణులు సూచిస్తుంటారు. మ్యూచువల్‌ ఫండ్లను నిపుణులైన ఫండ్‌ మేనేజర్లు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులను కొత్తగా ప్రారంభించేవారు లార్జ్‌క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇతర ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లతో పోల్చినప్పుడు లార్జ్‌క్యాప్‌ ఫండ్లు తక్కువ రిస్క్‌ను కలిగి ఉంటాయి. 

3, 5, 10 సంవత్సరాలలో 12% కంటే ఎక్కువ రాబడిని అందించే ఫండ్ల జాబితాను కింది పట్టికలో తెలిపాం. 2023 అక్టోబర్‌ 5 వరకు అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఇక్కడ చూడండి.

గమనిక: మ్యూచువల్‌ ఫండ్ పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఇవే ఫలితాలు భవిష్యత్తులోనూ వస్తాయని హామీ లేదు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు సెబీ రిజిష్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని