iPhone: మేడిన్ ఇండియా ఐఫోన్ ఎగుమతుల విలువలో 162% వృద్ధి
‘మేడిన్ ఇండియా’ ఐఫోన్ల ఎగుమతులు 2022లో భారీగా పెంచింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఎగుమతులు పరిమాణంలో 65% వృద్ధిని నమోదు చేసుకుంది.
ఇంటర్నెట్‌డెస్క్: ‘మేడిన్ ఇండియా’ ఐఫోన్ల ఎగుమతులు 2022లో భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఎగుమతులు పరిమాణంలో 65%, విలువలో 162% పెరిగినట్లు రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ తెలిపింది. దేశంలో పెరుగుతున్న యాపిల్ ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోందని పేర్కొంది.
భారత్‌లో ఐఫోన్ల తయారీ కోసం యాపిల్.. ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకొంది. యాపిల్ అభ్యర్థన మేరకు వీటిలో కొన్ని సంస్థలు మన దేశంలో తయారీని మరింత పెంచే యోచనలో ఉన్నాయి. ఈ క్రమంలోనే పెగాట్రాన్, ఫాక్స్‌కాన్ కొత్త ప్లాంట్లను నిర్మించే సన్నాహాల్లో ఉన్నాయి. ఫాక్స్‌కాన్ హైదరాబాద్‌లో తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
2022లో భారత్ నుంచి అత్యధికంగా ఒప్పో స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి అయ్యాయి. మొత్తం ఫోన్ల ఎగుమతుల్లో ఈ కంపెనీ వాటా 22 శాతం. తర్వాతి స్థానంలో శాంసంగ్ ఉంది. దేశీయంగా తగ్గిన గిరాకీని స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు ఎగుమతులను పెంచడం ద్వారా పూడ్చుకున్నాయి. అయితే, మొత్తంగా క్రితం ఏడాదితో పోలిస్తే 2022లో స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు మూడు శాతం తగ్గి 188 మిలియన్ యూనిట్లకు చేరాయి. స్థూల ఆర్థిక సవాళ్లే ఎగుమతుల్లో క్షీణతకు కారణమని కౌంటర్‌పాయింట్ పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో నిజామాబాద్ వాసి సజీవ దహనం
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే