Mahindra: మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ప్రో వచ్చేసింది.. ధర ఎంతంటే?

Mahindra XUV400 Pro: ఎక్స్‌యూవీ 400 ప్రో పేరుతో మహీంద్రా మూడు వేరియంట్లలో కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాన్ని తీసుకొచ్చింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Updated : 11 Jan 2024 18:32 IST

Mahindra XUV400 Pro | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra & Mahindra) నవీకరించిన ఎక్స్‌యూవీ 400 (XUV400) ఎలక్ట్రిక్‌ వాహనాన్ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎక్స్‌యూవీ 400 ప్రో (XUV400 Pro) పేరుతో మూడు వేరియంట్లలో ఈ కారును తీసుకొచ్చింది.

ఇందులో ఏసీ ప్రో వేరియంట్‌ (34.5kWh బ్యాటరీ, 3.3kW ఏసీ ఛార్జర్‌) ధర రూ.15.49 లక్షలు, ఈఎల్‌ ప్రో (34.5kWh బ్యాటరీ, 7.2 kW ఏసీ ఛార్జర్‌) మోడల్‌ ధర రూ.16.74 లక్షలు కాగా, ఈఎల్‌ ప్రో వేరియంట్‌ (39.4kWh బ్యాటరీ, 7.2 kW ఏసీ ఛార్జర్‌) ధర రూ. 17.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. రేపటి నుంచి బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయని, రూ.21,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. మే 31 తర్వాత వాహన ధరల్లో మార్పు ఉంటుందని పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి కారు డెలివరీలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది.

ఫీచర్లు ఇవే..

మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ప్రో ఈసీ ప్రో వేరియంట్‌లో 34.5 kWh బ్యాటరీ ప్యాక్‌ అమర్చారు. 3.7 kW ఏసీ ఛార్జర్‌తో రానుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 375 km ప్రయాణించవచ్చు. ఈఎల్‌ ప్రో వేరియంట్ లో 34.5 kWh, 39.4 kWh.. రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఇచ్చారు. ఈ రెండు వేరియంట్లలోని ఎలక్ట్రిక్‌ మోటార్‌ 150hp శక్తిని, 310 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 150 kph టాప్‌ స్పీడ్‌తో.. కేవలం 8.3 సెకన్లలో 0-100 km వేగాన్ని అందుకుంటుంది. 7.2 kW ఏసీ ఛార్జర్‌తో వస్తోంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 456 km ప్రయాణించొచ్చు. సన్‌రూఫ్‌తో వస్తోన్న ఈ కారులో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని