Microsoft Wordpad: విండోస్‌ నుంచి ఇక వర్డ్‌ప్యాడ్‌ మాయం.. గుడ్‌బై చెప్పనున్న మైక్రోసాఫ్ట్‌!

Microsoft Wordpad: విండోస్‌ ఓఎస్‌ నుంచి వర్డ్‌ప్యాడ్‌ కనుమరుగు కానుంది. కొత్త వెర్షన్‌లో దీన్ని తొలగించనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది.

Updated : 05 Sep 2023 16:17 IST

Microsoft to remove WordPad | ఇంటర్నెట్ డెస్క్‌: కంప్యూటర్‌ వాడుతున్నవారందరికీ సుపరచితమైన వర్డ్‌ప్యాడ్‌ (Wordpad) త్వరలో కనుమరుగు కానుంది. భవిష్యత్‌లో రాబోయే ఓఎస్‌ అప్‌డేట్‌లో దీన్ని మైక్రోసాఫ్ట్‌ తొలగించనుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ అధికారికంగా తన సపోర్ట్‌ పేజీలో పేర్కొంది. రిచ్‌టెక్ట్స్‌ డాక్యుమెంట్స్‌ (.doc, .rtf) వాడాలనుకునేవారు ఇకపై మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ వినియోగించుకోవాలని సూచించింది. సాధారణ టెక్ట్స్‌ కోసం నోట్‌ ప్యాడ్‌ వినియోగించుకోవాలని అందులో పేర్కొంది.

వర్డ్‌ప్యాడ్‌ను తొలుత 1995లో విడుదల చేసిన విండోస్‌ 95లో మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఉచితంగా అందుబాటులో ఉంటోంది. చివరిసారిగా విండోస్‌ 7లో వర్డ్‌ప్యాడ్‌ యూఐలో మార్పులు చేశారు. ఆ తర్వాతి నుంచి మైక్రోసాఫ్ట్‌ పూర్తిగా మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌పైనే దృష్టి సారించింది. ఇప్పుడు ఏకంగా విండోస్‌ 12 నుంచి దాన్ని పూర్తిగా తొలగించాలని మైక్రోసాఫ్ట్‌ నిర్ణయించింది. భవిష్యత్‌లో ఎలాంటి అప్‌డేట్సూ ఉండవని స్పష్టంచేసింది.

ఒకే టికెట్‌తో 56 రోజుల ప్రయాణం.. దీని గురించి తెలుసా?

అదే సమయంలో నోట్‌ప్యాడ్‌లో (Notepad) ఆటో సేవ్‌, ఆటో రీస్టోర్‌ సదుపాయాలను మైక్రోసాఫ్ట్‌ తీసుకురానుంది. అయితే, సాధారణ టెక్ట్స్‌ రాసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్‌ను రూపొందించాలంటే మాత్రం మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌కు మళ్లాల్సిందే. విండోస్‌ 365 ప్యాకేజీలో భాగంగా ఇది లభిస్తోంది. దీనికి నెలవారీ, వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు విండోస్‌ 11కు కొనసాగింపుగా లేటెస్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్‌ 12ను వచ్చే ఏడాది తీసుకొచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ సన్నాహాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని