Elon Musk- Modi: ఎలాన్‌ మస్క్‌తో భేటీ కానున్న మోదీ.. డీల్‌ కుదిరేనా?

Elon Musk- Modi: ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన అధ్యక్షుడు బైడెన్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు.

Updated : 20 Jun 2023 15:12 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) తన తాజా అమెరికా పర్యటనలో టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)తో సమావేశం కానున్నారు. చివరిసారి వీరివురు 2015లో భేటీ అయ్యారు. అప్పట్లో కాలిఫోర్నియాలోని టెస్లా మోటార్స్‌ ఫ్యాక్టరీని మోదీ సందర్శించారు.

భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు నిమిత్తం టెస్లా (Tesla) ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో మోదీ, మస్క్‌ మధ్య సమావేశం జరగనుంది. దీంతో వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. భారత మార్కెట్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్‌ అన్నారు. ఈ ఏడాది చివరి కల్లా ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అందుకోసం స్థలాన్ని వెతికే పనిలో ఉన్నామని చెప్పారు.

నేడు ఉదయం అమెరికాకు బయలుదేరిన మోదీ న్యూయార్క్‌లో దిగనున్నారు. ఈ పర్యటనలో అధ్యక్షుడు బైడెన్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోనూ ఆయన భేటీ కానున్నారు. వీరిలో మస్క్‌ సహా పారిశ్రామికవేత్తలు, నోబెల్‌ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యారంగ నిపుణులు ఉన్నారు. అమెరికాలో జరుగుతున్న అభివృద్ధిని అధ్యయనం చేయడం.. ఆయా రంగాల్లో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడమే ఈ భేటీల ప్రధాన ఉద్దేశమని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని